MLA Padi Kaushik Reddy: దళిత బంధు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నా, అరెస్ట్ చేసిన పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం, పలువురికి గాయాలు

హుజురాబాద్‌లో దళిత బంధు లబ్దిదారుల పక్షాన ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా లబ్దిదారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురికి గాయాలు కాగా ఎమ్మెల్యేతో సహా పలువురిని ఆస్పత్రికి తరలించారు.

BRS MLA Padi Kaushik Reddy Injured for protest on Dalit Bandhu funds, MLA hospitalized(Video grab0

Hyd, Nov 9: హుజురాబాద్‌లో దళిత బంధు లబ్దిదారుల పక్షాన ధర్నాకు దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. లబ్ధిదారులకు వెంటనే డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా లబ్దిదారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురికి గాయాలు కాగా ఎమ్మెల్యేతో సహా పలువురిని ఆస్పత్రికి తరలించారు.

పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసుల దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం చేయాలని అడిగితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే?...ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్...అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపిందన్నారు.

కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే...మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తాం అన్నారు. కౌశిక్ రెడ్డి అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. కేటీఆర్‌పై హరీశ్‌ రావు ప్రశంసలు, ఐటీలో తెలంగాణను నెంబర్‌ 1 చేసిన కేటీఆర్ అంటూ కితాబు, ప్రశ్నించే గొంతుకలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి సరికాదని ఆగ్రహం

ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని...మొన్న ఈ మధ్యనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గాంధీ తో గుండాగిరి చేయించి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు అన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడి చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే భయపడి దాడులకు పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు అని...కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడారు అని తేల్చిచెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement