C-KYC Portal: బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్, తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు, బ్యాంకుకు వెళ్లనవసరం లేదని తెలిపిన RBI

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఆన్‌లైన్‌లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్‌ (e-KYC) పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) తెలిపింది.

Rbi Governor (Photo-ANI)

కేవైసీ ధృవీకరణ లేదా అప్‌డేషన్‌ కోసం కస్టమర్లు కచ్చితంగా శాఖకు రావాలంటూ బ్యాంకులు డిమాండ్‌ చేయరాదని, అలాంటి నిబంధన ఏదీ పెట్టలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. అలాగే సెంట్రల్‌–కేవైసీ (సీ–కేవైసీ) పోర్టల్‌లో తమ వివరాలను అప్‌లోడ్‌ చేసిన కస్టమర్లను కూడా బ్యాంకులు.. వెరిఫికేషన్‌ కోసం అడగనక్కర్లేదని తెలిపారు.

 ఈఎంఐలు కడుతున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్! మరోసారి వడ్డీరేట్లు పెంచుతూ ఆర్బీఐ ప్రకటన, వరుసగా మూడోసారి రెపోరేటును పెంచిన కేంద్రబ్యాంకు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ తగ్గించేందుకు చర్యలంటూ ప్రకటన

అలాంటి సందర్భాల్లో కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సీ–కేవైసీ పోర్టల్‌ నుంచి యాక్సెస్‌ చేసుకోవాలంటూ అధికారిక ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబరు ద్వారా బ్యాంకుకు మెయిల్‌ లేదా మెసేజీ పంపించవచ్చని దాస్‌ పేర్కొన్నారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement