File image of RBI Governor Shaktikanta Das | (Photo Credits: PTI)

Mumbai, DEC 07: ఆర్బీఐ (RBI Raises Rates) మరోసారి రెపో రేటును పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ (RBI Governor Shaktikanta Das) ప్రకటించారు. ఆర్బీఐ త్రైమాసిన ద్రవ్యపరపతి సమీక్షలో (monetary policy committee) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరుగనుంది. గడిచిన రెండు సమీక్షల్లో కూడా రెపోరేటును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో వడ్డీరేట్లపై ప్రభావం కనిపించనుంది. గత మూడు రోజులుగా ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష కొనసాగుతోంది. ఇందులోని మెజార్టీ సభ్యులు రెపోరేటు (Repo rate) పెంపునకు మొగ్గు చూపినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అయితే దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. ఆర్‌బీఐ డిసెంబరులో స్వల్పంగా వడ్డీ రేట్టు పెంచే అవకాశముందని, 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెరగొచ్చని, 6.25 శాతంగా రెపో రేటు ఉండొచ్చని ముందుగానే వివరించింది.

అంతకుముందు ఏప్రిల్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా 10 సార్లు రెపో రేటును యథాతథంగా ఉంచింది. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును తక్షణమే 40 బేసిస్ పాయింట్లు పెంచింది.ఆర్బీఐలో గతంలో మూడు సార్లు 50 bps పెంచింది. రెపో రేటు పెంపుతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు పెంచ అవకాశం ఉంది. వడ్డీ రేట్ పెరిగితే రుణగ్రహీతల ఈఎంఐ పెరగనుంది.

Bank Holidays in December: డిసెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, నెలలో దాదాపు 13 రోజుల వరకు మూత పడనున్న బ్యాంకులు, పూర్తి వివరాలు ఇవిగోండి! 

ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు (Stock Market) ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి నుంచే మార్కెట్లపై ఈ ఎఫెక్ట్ కనిపించింది. తాజాగా ఆర్బీఐ ప్రకటన తర్వాత మార్కెట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.