ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించడానికి తాను తొందరపడటం లేదని భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ సంకేతాలు ఇచ్చారు. సింగపూర్‌లో బ్రెట్టన్ వుడ్స్ కమిటీ నిర్వహించిన ఫోరమ్‌లో శుక్రవారం గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నాం. వరుసగా రెండో నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉందని గణాంకాలు వెలువడ్డాయి అని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణంలో కొన్ని పతనాల వల్ల నష్టపోకుండా ఉండాలనే ప్రాముఖ్యతను మేము పునరుద్ఘాటిస్తున్నామని అన్నారు. వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం UIDAI 10 సంవత్సరాల పాత ఆధార్ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) చివరి తేదీ అని UIDAI ప్రకటించింది. మీరు ఈ తేదీలోగా పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వయస్సుకు సంబంధించి ఆధార్ కార్డ్‌లో మార్పులు చేయాలనుకుంటే ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే 18 నెలలకు పైగా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. కొందరు ఆర్థికవేత్తలు ఈ సంవత్సరం చివరి త్రైమాసికం వరకు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను మార్చబోదని అభిప్రాయపడుతున్నారు. అయితే పట్టణ ప్రజల వ్యయ సామర్థ్యం క్షీణిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతుండడంతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా వడ్డీరేట్లు తగ్గించాలని కొందరు అంటున్నారు. ఇప్పటికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేట్లను 3.75 శాతానికి తగ్గించింది.