Central Govt Calls Tenders For RRR: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంలో (North Side of Regional Ring Road) నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఐదు భాగాలుగా విభజించి.. రూ.7,104 కోట్లతో మొత్తం 161.5 కి.మీ మేర రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు.

Regional Ring Road (PIC@ X)

Hyderabad, DEC 28: రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంలో (North Side of Regional Ring Road) నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ఐదు భాగాలుగా విభజించి.. రూ.7,104 కోట్లతో మొత్తం 161.5 కి.మీ మేర రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. రెండేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనల్లో పొందుపర్చారు.

Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్‌ రెడ్డి తెలుసా?  

ప్యాకేజీ-1: సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌-రెడ్డిపల్లి(34.518.మీ).

ప్యాకేజీ-2: రెడ్డిపల్లి నుంచి ఇస్లాంపూర్‌ వరకు 26 కి.మీ నిర్మాణం.

ప్యాకేజీ-3: ఇస్లాంపూర్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌ వరకు 23 కి.మీ నిర్మాణం.

ప్యాకేజీ-4: ప్రజ్ఞాపూర్‌ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి(43 కి.మీ)

ప్యాకేజీ-5: రాయగిరి నుంచి తంగడిపల్లి వరకు 35 కి.మీ నిర్మాణం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగింపు, ఎస్పీఎఫ్‌ బలగాలకే డ్యాం భద్రత అప్పగింత...కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం 

కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ, తన కృషికి దక్కిన ఫలితమే ఆర్‌ఆర్‌ఆర్‌ టెండర్లు అని అన్నారు. ‘‘రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు ఇది. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఎన్నోసార్లు సీఎం రేవంత్‌ రెడ్డితో కలిసి దిల్లీకి వెళ్లాను. కేంద్ర మంత్రి గడ్కరీకి ఎన్నోసార్లు వినతులు ఇచ్చాం. ఆర్‌ఆర్‌ఆర్‌.. తెలంగాణ బిడ్డల భవిష్యత్‌కు బంగారు బాట వేస్తుంది. ఓఆర్‌ఆర్‌ లాగే.. ఆర్‌ఆర్‌ఆర్ సూపర్‌ గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. 5 భాగాలుగా ఉత్తర భాగం ఆర్‌ఆర్ఆర్ పనులు చేపడతాం. కాంగ్రెస్‌ పార్టీ ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం ఇది’’ అని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement