IPL Auction 2025 Live

COVID-19 in India: భారతదేశంలో 9,152కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, 308కు పెరిగిన మరణాల సంఖ్య, ఇప్పటివరకు 856 మంది రికవరీ అయ్యారని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

40కి పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, అయితే ఇందులో ఏదీ తదుపరి దశకు చేరుకోలేదని తెలిపింది.......

Coronavirus in India (Photo Credits: IANS)

New Delhi, April 13:  గడిచిన 24 గంటల్లో 796 కొత్త కేసులు, 35 మరణాలతో భారతదేశంలో వరకు సోమవారం కరోనావైరస్ కేసుల (COVID-19 in India) సంఖ్య 9,152 కు చేరిందని, అలాగే COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య 308 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు 856 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు, ఇంకొకరు ఇతర దేశానికి మైగ్రేట్ అయ్యారు. ఈ లెక్కన ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,987 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నాయి, ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి: టీఎస్ సీఎం కేసీఆర్

1,982 COVID-19 పాజిటివ్ కేసులతో మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఆదివారం కొత్తగా 221 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముంబైలో నిన్న ఒక్కరోజులోనే 16 కరోనా మరణాలు నమోదవడం దేశంలోనే తొలిసారి. అలాగే పుణె నుంచి 3, నవీ ముంబై నుంచి 2 మరియు సోలాపూర్ నుంచి 1 కోవిడ్-19 కారణంగా చనిపోయారు. దీంతో మహారాష్ట్రలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 149కి చేరుకుంది. ఇందులో 91 మరణాలు ముంబై నగరం నుంచే కావడం గమనార్హం.

Here's the update:

ప్రాణాంతక కోవిడ్-19ను నియంత్రించేందుకు వాక్సిన్ తయారీ జరుగుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పేర్కొంది. 40కి పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, అయితే ఇందులో ఏదీ తదుపరి దశకు చేరుకోలేదని తెలిపింది. ఇక కోవిడ్-19 నిర్ధారణ కోసం దేశవ్యాప్తంగా 151 ప్రభుత్వ మరియు 68 ప్రైవేట్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఐసిఎంఆర్ వెల్లడించింది.

ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలో నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో COVID-19 కేసుల సంఖ్య 5 లక్షల 50 వేలు దాటింది. ఒక్క న్యూయార్క్ నగరం నుంచే 189,020 కేసులు, 9,385 మరణాలు నమోదయ్యాయి, దీని తర్వాత న్యూజెర్సీలో 61,850 కేసులు, 2,350 మరణాలు సంభవించాయి.