7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ముందుగానే వచ్చిన ఉగాది, డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం, పెన్షనర్లకు కూడా లబ్ది చేకూరేలా డీఆర్ పెంపు

ఉగాది పండగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు (Centrel Govt. Employees) కేంద్రం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (DA) 3శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ (DA), పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను (DR) 3శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం (Cabinet) అంగీకరించింది.

Maharashtra crisis maharashtra-governor-recommends-presidents-rule-in-the-state (Photo-PIB)

New Delhi, March 30: ఉగాది పండగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు (Centrel Govt. Employees) కేంద్రం శుభవార్త చెప్పింది. కరవు భత్యం (DA) 3శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకిచ్చే డీఏ (DA), పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను (DR) 3శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం (Cabinet) అంగీకరించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో అది 34 శాతానికి చేరింది. ఈ పెంపు జనవరి 1, 2022 నుంచే వర్తిస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపారు. కేంద్రం నిర్ణయంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50కోట్ల మేర అదనపు భారం పడనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండోసారి. అంతకుముందు గతేడాది అక్టోబరులో దీపావళి కానుకగా డీఏను 3శాతం పెంచారు. జులై 2021 నుంచే ఆ పెంపు వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆ మధ్య ఏడాదిన్నర పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని నిలిపివేశారు. 2021 జులైలోనే దాన్ని పునరద్ధరిండమే గాక, ఒకేసారి 11శాతం పెంచారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement