Delhi Shocker: నరబలి కోసమేనా ఈ దారుణం, పసిబాలుడి తలను మొండెంను వేరు చేసిన దుర్మార్గుడు, యూపీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన (Delhi Shocker) చోటు చేసుకుంది. ఒక చిన్నారిని అతని పొరిగింటి వాడే దారుణంగా హత్య చేశారు. తల, అవయవాలు లేకుండా మొండెంతో ఆ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Representational image (photo credit- IANS)

Delhi, Dec 7: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన (Delhi Shocker) చోటు చేసుకుంది. ఒక చిన్నారిని అతని పొరిగింటి వాడే దారుణంగా హత్య చేశారు. తల, అవయవాలు లేకుండా మొండెంతో ఆ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...యూపీలోని మీరట్‌లో జాతీయ రహదారి పక్కన (Meerut-Pauri National Highway) ఒక పొలంలో తల లేకుండా ఉ‍న్నా మూడేళ్ల చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భూ వివాదం, బంధువు తల నరికి రక్తం కారుతుండగా సెల్ఫీ, జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ కేసు విచారణలో పొరుగింటి వ్యక్తే ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది.ఈ మేరకు పోలీసులు 16 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు (Neighbour Arrested) చేశారు. అతడు విచారణలో బాలుడిని చెరుకు తోటలో వదిలేసినట్లు చెప్పడంతో.. పోలీసుల బృందం మీరట్‌లోని ఇంచోలిలోని నాంగ్లీ-ఇసా గ్రామానికి చేరుకుంది. అక్కడ సమీపంలోనే ఆ బాధిత చిన్నారి తలను కనుగొన్నారు. ఆ చిన్నారి వస్తువులు, బట్టలు ఆధారంగా నవంబర్‌ 30న తూర్పు ఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌లో తప్పిపోయిన చిన్నారిగా (Three-Year-Old Missing Boy) గుర్తించారు పోలీసులు.

గుంటూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని బ్లేడుతో యువతి గొంతు కోసి తన చేతిని కోసుకున్న ప్రేమోన్మాది, చికిత్స పొందుతూ యువతి మృతి

చిన్నారి దారుణ హత్య గురించి తెలుసుకుని...కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement