Jharkhand Shocker: భూ వివాదం, బంధువు తల నరికి రక్తం కారుతుండగా సెల్ఫీ, జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Murder (Photo Credits: Pixabay)

Khunti , Dec 6: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదం నేపథ్యంలో 20 ఏళ్ల గిరిజన యువకుడు 24 ఏళ్ల తన బంధువుని అత్యంత కిరాతకంగా తలనరికి (man beheads cousin) చంపేశారు. ఈ ఘటన ముర్హు ప్రాంతంలో చోటు చేసుకుంది.ఈ దారుణ ఘటనకు సంబంధించి ఖుంతీ సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి అమిత్‌ కుమార్‌ మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఖుంతీ జిల్లాలోని ముర్హూ ప్రాంతానికి చెందిన దేశాయి ముండాకు అతని మేనల్లుడు సాగర్‌ ముండాతో భూ వివాదాలు ఉన్నాయి. అయితే, ఆదివారం రోజు దేశాయి ముండా కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దేశాయి కుమారుడు కాను ముండాను సాగర్‌తోపాటు అతని స్నేహితులు కిడ్నాప్‌ చేశారు. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన దేశాయి కుటుంబ సభ్యులకు ఇంట్లో కాను ముండా కనిపించలేదు.

గుంటూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని బ్లేడుతో యువతి గొంతు కోసి తన చేతిని కోసుకున్న ప్రేమోన్మాది, చికిత్స పొందుతూ యువతి మృతి

దీంతో తన కుమారుడిని తన మేనల్లుడు, అతని స్నేహితులు కిడ్నాప్‌ చేశారని దేశాయి ముండా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాగర్‌ ముండాను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. నిందితులు చెప్పిన ఆధారాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు కుమాంగ్‌ గోపాల్‌ ఫారెస్ట్‌లో కాను ముండా శరీరభాగాన్ని (మొండెం) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి అమిత్‌ కుమార్‌ తెలిపారు.

విశాఖలో డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా నరికిన యువతి మృతదేహం, భర్తే నరికి డ్రమ్ములో దాచిపెట్టాడనే అనుమానాలు, ఏడాది తర్వాత దారుణ ఘటన వెలుగులోకి..

మొండెంకు 15 కిలోమీటర్ల దూరంలోని దుల్వా గుంగ్రీ ప్రాంతంలో కాను తలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నేరం అనంతరం నిందితులు నరికిన తలతో సెల్ఫీ తీసుకున్నట్లు (his friends take selfie) పేర్కొన్నారు. ఘటనాస్థలి వద్ద ఆరు సెల్‌ ఫోన్లు, రక్తపు మరకలతో కూడిన రెండు పదునైన ఆయుధాలు, ఒక గొడ్డలి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల తోపాటు ప్రధాన నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు.