Delhi: దేశ రాజధానిలో దారుణం, తుఫాకీతో బెదిరించి నగ్న వీడియోలు షూట్, ఆ తర్వాత రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్, తట్టుకోలేక ఆత్మహత్యాప్రయత్నం చేసిన ఎంబీఏ విద్యార్థి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోసుకుంది. ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి (South Delhi MBA Student) ఫినైల్‌ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి కారణం అతని నగ్న వీడియోలు బయటకు రావడమే. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... పథకంలో భాగంగా బాధిత ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు సన్నిహితంగా ఉన్నాడు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, Feb 8: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోసుకుంది. ఢిల్లీలో ఎంబీఏ విద్యార్థి (South Delhi MBA Student) ఫినైల్‌ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనికి కారణం అతని నగ్న వీడియోలు బయటకు రావడమే. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... పథకంలో భాగంగా బాధిత ఎంబీఏ విద్యార్థితో ఒక నిందితుడు సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ నిందితుడు అతన్ని అక్టోబర్‌ 23, 2020న కిడ్నాప్‌ చేసి (Delhi MBA Student Kidnapped) తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ తుపాకీ గురిపెట్టి అతని నగ్న వీడియోలు (, Nude Video Shot On Gunpoint), గంజాయి తాగుతున్న వీడియో, పిస్టల్‌ని పట్టుకుని ఉన్న వీడియోలను కూడా తీశారు.

ఈ మేరకు ఆ నిందుతుడు తప్పుడు కేసులో ఇరికిస్తానంటూ ఆ విద్యార్థిని బెదిరించి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబం రూ.5 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఆ నిందితుడి ఆ విద్యార్థి నగ్న వీడియోలను అతని కాలనీలోని వాళ్లకు, బంధువులకు పంపిచాడు. మళ్లీ ఫిబ్రవరి 1న ఫోన్‌ చేసి డబ్బు ఇవ్వాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. ఇక ఆ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ధర్మపాల్‌ అనే కానిస్టేబుల్‌ కూడా ఆ విద్యార్థిని బెదిరించడం ‌మొదలు పెట్టాడు.

కేరళలో దారుణం, భర్తకు ప్రతిరోజూ ఆహారంలో మత్తు మందు కలిపి పెట్టిన భార్య, ఆమె చెప్పిన వివరాలు విని ఖంగుతిన్న పోలీసులు

దీంతో ఆ విద్యార్థి మనస్తాపం చెంది ఆ విద్యార్థి ఫినైల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు ప్రధాన కారకుడైన నిందితుడిని అరెస్టు చేయడమే కాక ఇతర నిందితుల ఆచూకి కోసం విచారించడం ప్రారంభించారు. ఆ విద్యార్థి కుటుంబాన్ని కలిసిన పోలీస్ అధికారి.. నిందితులు పట్టుకుని అరెస్ట్‌ చేయడమే కాక సదరు కానిస్టేబుల్‌ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement