Dilish Parekh Dies: రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కెమెరాల కింగ్ డిలీష్ పరేఖ్ కన్నుమూత, ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా పరేఖ్ రికార్డు

ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన ముంబైకి చెందిన డిలీష్ పరేఖ్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Dilish Parekh (Image Credit: India Book of Records)

ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన ముంబైకి చెందిన డిలీష్ పరేఖ్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫ్రీలాన్స్ లెన్స్‌మ్యాన్‌గానూ పనిచేసిన పరేఖ్‌కు భార్య బినీత, కుమారులు జై, హర్ష్ ఉన్నారు. 2,634 పురాతన కెమెరాలు సేకరించినందుకు గాను 2003లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ఆ తర్వాత పదేళ్లకు తన రికార్డును తానే బద్దలుగొట్టారు. 4,425 కెమెరాలు సేకరించినందుకు గాను 2013లో మరోమారు గిన్నిస్ రికార్డ్స్‌లో మరోమారు చోటు దక్కించుకున్నారు.

అర్థరాత్రి నగ్నంగా తలుపులు కొడుతూ మహిళ హల్ చల్, రోడ్డు మీద బట్టలు లేకుండా తిరగడం చూసి జనాలు షాక్, సోషల్ మీడియాలో సీసీ టీవీ పుటేజీ వైరల్

ఆయన వద్ద లీకా, రోలిఫ్లెక్స్, జీస్, లినోఫ్, కెనాన్, నికాన్, కొడక్ కంపెనీల కెమెరాలున్నాయి. అలాగే, 1934లో జర్మనీ కంపెనీ తయారు చేసిన అత్యంత అరుదైన లీకా 250 కెమెరా కూడా ఉంది. దీంతోపాటు మరో అరుదైన జర్మన్ తయారీ కెమెరా ‘బెస్సా II’ కూడా ఉంది. ఇది 1962లో తయారైంది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చిన్నదైన ‘టెస్సినా ఎల్’ కెమెరాను కూడా పరేఖ్ సేకరించారు. దీని బరువు 155 గ్రాములు మాత్రమే.పరేఖ్ సేకరించిన కెమెరాల్లో 1907 నాటి లెదర్ బౌండ్ రాయల్ పోస్టేజ్ స్టాంప్ కెమెరా ప్రత్యేకమైనది. ఇది ఒకేసారి 15 స్టాప్ సైజ్ ఫొటోలను క్లిక్ చేస్తుంది.ఆయన వద్ద మొత్తం 4,500 వరకు కెమెరాలు ఉన్నాయి. తన సేకరించిన కెమెరాలలో ఒక్క దానిని కూడా ఆయన విక్రయించలేదు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement