IPL Auction 2025 Live

ED Summons Mohanlal: నటుడు మోహన్‌లాల్‌కు ఈడీ నోటీసులు, ఫేక్ కళాకండాల కేసులో ఇరుక్కున్న నటుడు, రూ. 10 కోట్లు మోసం చేసిన వ్యక్తితో లింకులు

ఆయన మనీలాండరిగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ విషయమై విచారించేందుకు వచ్చేవారం కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా ఈడీ కార్యాలయం మోహన్ లాల్ కు (Mohan Lal)నోటీసులు ఇచ్చింది. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మన్కల్ తో కలిసి మోహన్ లాల్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు

Kerala, May 14: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal)చిక్కుల్లో పడ్డారు. ఆయన మనీలాండరిగ్ కు (Money Laundering) పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ విషయమై విచారించేందుకు వచ్చేవారం కొచ్చిలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా ఈడీ కార్యాలయం మోహన్ లాల్ కు (Mohan Lal)నోటీసులు ఇచ్చింది. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మన్కల్ తో కలిసి మోహన్ లాల్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే పురాతన కళాఖండాలను (fake antique) అమ్ముతూ ప్రజలను 10 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో మాన్సన్‌ను (Monson Mavunkal) గత సెప్టెంబర్‌లో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి ఒకసారి మోహన్ లాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మోహన్ లాల్ అతని ఇంటికి ఎందుకు వెళ్లారనేది తెలియలేదు.

Tripura New CM: ఇంకో ఏడాదిలో ఎన్నికలుండగా సీఎం మార్పు, త్రిపురలో వ్యూహం మార్చుతున్న బీజేపీ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడికి సీఎం పదవి అప్పగింత, పాత సీఎంపై వ్యతిరేకతే కారణమనే వాదన 

కేరళకు చెందిన మాన్సన్ మన్కల్ (Monson Mavunkal) గత కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ.10 కోట్ల వరకు ప్రజలను మోసం చేశాడు. తనవద్ద టిప్పుసుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలి గోళ్లు, వంటి వస్తువులు ఉన్నాయని చెప్పి ప్రజలను మోసం చేశాడు. మాన్సన్ పలువురు ప్రముఖులను తన ఇంటికి పిలిపించి తాను సేకరించానని చెప్పుకునే కళాఖండాలను వారికి చూపించేవాడు. ప్రస్తుతం మాన్సన్ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.