Blood Transfusion: అభం శుభం తెలియని చిన్నారులకు హెచ్‌ఐవీ బ్లక్ ఎక్కించిన సిబ్బంది, ప్రాణాలు తీసిన రక్తమార్పిడి, ముగ్గురు చిన్నారులకు హెచ్‌ఐవీ, ఒకరు మృతి, మహారాష్ట్రలో ఘటన

వారిలో ఒకరు మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో (Nagpur) ఈ సంఘటన జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఇటీవల రక్త మార్పిడి (blood transfusion) జరిగింది. అయితే రక్త కేంద్రం లేకపోవడంతో కలుషిత రక్తాన్ని వారికి ఎక్కించారు.

Mumbai, May 27: కలుషితమైన రక్తం మార్పిడి (blood transfusion) వల్ల నలుగురు పిల్లలకు హెచ్ఐవీ సోకింది. వారిలో ఒకరు మరణించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో (Nagpur) ఈ సంఘటన జరిగింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఇటీవల రక్త మార్పిడి (blood transfusion) జరిగింది. అయితే రక్త కేంద్రం లేకపోవడంతో కలుషిత రక్తాన్ని వారికి ఎక్కించారు. దీంతో నలుగురు పిల్లలకు హెచ్‌ఐవీ(HIV) సోకింది. వీరిలో ఒకరు చనిపోవడం కలకలం రేపింది. గురువారం మీడియాలో వచ్చిన ఈ వార్తా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్వీకరించింది. మానవ హక్కుల ఉల్లంఘనపై మహారాష్ట్ర (Maharashtra) ప్రధాన కార్యదర్శి, ఫుడ్‌, డ్రగ్స్‌ శాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా, పొదుపు అనేదే కానరావడం లేదా..అయితే జ్యోతిష్యులు చెప్పే ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి 

బాధిత కుటుంబాలకు మధ్యంతర పరిహారం, హెచ్‌ఐవీ సోకిన పిల్లలకు సరైన వైద్యం అందించాలని కోరింది. వీటిపై తీసుకున్న చర్యలపై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల్లో ఐదుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెపటైటిస్ బీ సోకినట్లు వెల్లడించింది.



సంబంధిత వార్తలు

Central Govt Calls Tenders For RRR: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్

Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్‌ రెడ్డి తెలుసా?

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Telangana Govt. Declares Holiday: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు