ప్రస్తుత కాలంలో డబ్బు అనేది చాలా విలువైనదిగా మారింది. అది లేకుంటే ఏ పని జరగడం లేదు. డబ్బును బట్టే సమాజంలో గౌరవం ఉంటోంది. అందరూ ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఎంత కష్టపడినా కొంత మంది ఆ స్థాయికి చేరుకోలేరు. దీనికి అనే కారణాలు ఉన్నాయి. ఆదాయం ఉన్న పొదుపు చేసే తెలివితేటలు లేకపోతే నష్టాలు రావడం, ఆర్థికంగా అదే స్థాయిలో ఉండిపోవడం జరుగుతుంటుంది. వీటికి తోడు చాలా మంది గ్రహస్థితే ఇందుకు కారణం అనుకుంటున్నారు. ఏం చేస్తాం ఎంత సంపాదించినా అదృష్టం లేకపోతే అంతే కాలాన్ని గడిపేస్తున్నారు. అలాంటి వారి కోసమే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కొన్ని సూచనలు చేశారు.
వృత్తిలో విజయం, గౌరవం, పురోగతి ఇచ్చే గ్రహం సూర్యుడు అంటారు. అందుకే ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యుడికి అర్ఘ్యాన్ని తప్పక సమర్పించాలట. ఇలా చేస్తే కెరియర్ లో ఉన్న అడ్డంకులు తొలగుతాయట. అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసీ చెట్టును లక్ష్మీ దేవిగా భావిస్తాం. లక్ష్మీ దేవి మన ఇంట్లో నిలవాలంటే (Earning And Saving Money) నిత్యం తులసి చెట్టుకు పూజ చేయాలని వేద పండితులు వివరిస్తున్నారు. నీళ్లు పోస్తూ… దీపారాధన చేయాలని వివరిస్తున్నారు.లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కనకారా స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం చదవడం చాలా మంచిదట.
శని ప్రభావంతో ఈ నాలుగు రాశులవారు జూన్ 5 నుంచి అక్టోబర్ 23 వరకూ జాగ్రత్తగా ఉండాలి
అలా చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయట. అంతే కాకుండా లక్ష్మీ దేవి కృప మనపై ఉండి ఆదాయ మార్గాలు పెరుగుతాయట. శివుడి అనుగ్రహం వల్ల అన్ని బాధల పోతాయట. ఇది జీవితంలో అపారమైన ఆనందాన్ని శ్రేయస్సును కూడా ఇస్తుంది. అందుకే ప్రతిరోజూ శివ లింగానికి అభిషేకం చేయడం మంచిది. వీలైతే పాలు కలిపిన నీటితో అభిషేకం చేయండి.