Health Tips: మీ వంటింట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం.
అటువంటి వ్యాధులు రావడానికి ప్రధానంగా కారణాలైన మన జీవనశైలిలో మార్పు, కాలుష్యం, కొన్ని రకాలైనటువంటి వంటకు ఉపయోగించే వస్తువులు వీటివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి.
ఈరోజుల్లో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి వ్యాధులు రావడానికి ప్రధానంగా కారణాలైన మన జీవనశైలిలో మార్పు, కాలుష్యం, కొన్ని రకాలైనటువంటి వంటకు ఉపయోగించే వస్తువులు వీటివల్ల అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తుంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేటువంటి వస్తువులు మన వంటింట్లో ఉన్నాయి. వాటిని తీసివేయాలి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నాన్ స్టిక్ పాత్రలు- నాన్ స్టిక్ పాత్రలో ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ప్రభావం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నాన్ స్టిక్ పాత్రలకు బదులుగా సిరామిక్, స్టీలు, ఐరన్ వంటి పాత్రలను ఉపయోగించాలి. మట్టి పాత్రలను కూడా ఉపయోగించవచ్చు. వీటివల్ల క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
ప్లాస్టిక్ కంటైనర్లు- మన ఇంట్లో ప్లాస్టిక్ కంటైర్యలను వంటగదిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా అన్ని ఆహార పదార్థాలు దాచుకోవడానికి ముఖ్యంగా పప్పులు, పొడులు వంటి వాటిని దాచుకోవడానికి మనం ఈ ప్లాస్టిక్ కంటెర్లను వాడుతుంటాము. అయితే వాటికి బదులుగా గాజు డబ్బాలను లేదా స్టీల్ కంటైర్లను ఉపయోగించాలి. వీటివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లాస్టిక్ కంటైనర్లు వాడటం వల్ల ఇందులో కెమికల్స్ ఎక్కువగా వాడుతారు. దీని వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రిఫైండ్ ఆయిల్- రిఫండ్ ఆయిల్ లో కూడా క్యాన్సర్ ను పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గనక రిఫండ్ ఆయిల్ ను వాడుతున్నట్లయితే దానిని మానివేసి వాటికి బదులుగా కోల్డ్ ప్లస్ ఆయిల్ ను, ఆలివ్ ఆయిల్ ను, అవకాడో ఆయిల్ ను వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్లాస్టిక్ చాపర్- ప్లాస్టిక్ చాపర్లు చాలామంది కూరగాయలు కట్ చేయడానికి వాడుతూ ఉంటారు. అయితే వాటికి బదులుగా చెక్క లేదా స్టీల్ చాపర్ బోర్డులను తీసుకుంటే మంచిది. ఇవి ఎక్కువ కాలం రావడమే కాకుండా రసాయనాలు ఉపయోగించరు. కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
Health Tips: షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా.
అల్యూమినియం ఫైల్ పేపర్- చాలామంది అల్యూమినియం ఆయిల్ పేపర్ ను ఉపయోగిస్తూ ఉంటారు., వీటి బదులుగా సిలికాన్, బేకింగ్ మాట్స్ ను ఉపయోగించాలి. లేదా బట్టర్ పేపర్లు కూడా ఉపయోగించవచ్చు.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్- ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను ఎక్కువగా వాడడం ద్వారా క్యాన్సర్కు కారణం అవుతాయి. వీటి బదులుగా ముఖ్యంగా స్టీలు లేదా గాజు రాగి సీసాలను ఉపయోగించడం ఉత్తమం. వీటివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.