Jharkhand CM Hemant Soren: ఆ రాష్ట్ర సీఎం కుటుంబంలో 15 మందికి కరోనా పాజిటివ్, ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు మాత్రం తేలిన నెగిటివ్

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Jharkhand Mukti Morcha (JMM) president Hemant Soren. | Image Courtesy: PTI

రాంచీ, జనవరి 9: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్‌లో సైతం రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. పరీక్షల్లో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నెగిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62 మందికి కోవిడ్ -19 పరీక్షలు చేసినట్లు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. వారిలో 24 మంది రిపోర్టులు శనివారం సాయంత్రం నాటికి వచ్చాయని.. వారిలో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వారిలో సీఎం భార్య కల్పనా సోరెన్, వారి ఇద్దరు కుమారులు నితిన్, విశ్వజిత్, కోడలు సరళా ముర్ము ఉన్నారని కుమార్ తెలిపారు. నివాసంలో ఉన్న వారందరికీ తేలికపాటి కోవిడ్ -19 లక్షణాలు ఉన్నాయన్నారు. వారంతా ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ అయినట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా సైతం కోవిడ్ బారిన పడ్డారు. శనివారం పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో ఆయన జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో ఐసోలేట్ అయ్యారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా అంతకుముందు కూడా ఆరోగ్యమంత్రి కరోనా సోకింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement