Kolkata Shocker: ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్న భార్య‌, ఎవ‌రితో ప‌డితే వాళ్ల‌తో మాట్లాడుతుంద‌ని క‌త్తితో పొడిచి చంపిన భార్య‌

అపర్ణ తరచూ వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో (Social Media) పోస్టు చేస్తుండేది. అది నచ్చకపోవడంతో భర్త గొడవపడేవాడు. ఇటీవల ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన భర్త అపర్ణ గొంతుకోసి హత్య చేసాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు 7 వ తరగతి చదువుతుండగా, కూతురు నర్సరీ చదువుతోంది.

Murder Representative Photo (Photo Credit: Pixabay)

Kolkata, NOV 25: సోషల్ మీడియా ఇటీవల భార్యభర్తల మధ్య చిచ్చుపెడుతోంది. భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ (Reels) పోస్టు చేస్తోందని, అందరితో స్నేహాలు చేస్తోందని కక్ష పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా చంపిన ఘటన కోల్‌కతాలో జరిగింది. ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య గొడవలకు సోషల్ మీడియా కూడా కారణమవుతోంది. రీల్స్ చేయడం, వీడియోలు చేయడం, సోషల్ మీడియా స్నేహాలు కారణంగా చాలామంది భార్యాభర్తలు తగవులాడుకుంటున్నారు. కోల్‌కతాలో (Kolkata) పరిమళ బైద్య (38) అనే వ్యక్తి తన భార్య (35) అపర్ణ సోషల్ మీడియాలో రీల్స్ (Instagram) చేస్తోందని, అందరితో పరిచయాలు పెంచుకుంటోందనే అనుమానంతో దారుణంగా కడతేర్చాడు. హరినారాయణపూర్‌లో ఈ ఘటన జరిగింది.

Palnadu Crime: కూతుర్ని వేధిస్తున్నందుకు అల్లుడితో పాటూ కుటుంబం మొత్తాన్నినరికి చంపిన బంధువులు, పల్నాడులో కలకలం రేపిన మూడు హత్యలు, స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు 

అపర్ణ తరచూ వీడియోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో (Social Media) పోస్టు చేస్తుండేది. అది నచ్చకపోవడంతో భర్త గొడవపడేవాడు. ఇటీవల ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన భర్త అపర్ణ గొంతుకోసి హత్య చేసాడు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు 7 వ తరగతి చదువుతుండగా, కూతురు నర్సరీ చదువుతోంది. పరిమళ బైద్య తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఘటన జరిగినపుడు ఇద్దరు పిల్లలు ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. అపర్ణను హత్య చేసి పరారైన పరిమళ బైద్య కోసం పోలీసులు వెతుకుతున్నారు. హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

H9n2 Outbreak in China: చైనాలో కొత్త వైరస్, భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ, హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కారణంగా భారీగా పెరిగిన న్యూమోనియా కేసులు  

రీల్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అపర్ణ, పరిమళ బైద్య గొడవ పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువమంది స్నేహితులను సంపాదించడం, వారితో టచ్‌లో ఉండటం.. ముఖ్యంగా మనీ లెండింగ్ ఏజెన్సీకి చెందిన ఓ అధికారితో అపర్ణ మాట్లాడటం భర్త పరిమళ బైద్య సహించలేకపోయాడని వారు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిమళ బైద్య ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement