Government Closely Monitoring H9n2 Outbreak in China: చైనాలో ప్రస్తుతం హెచ్9ఎన్2 వైరస్ కేసులు( H9N2 Cases) భారీగా పెరుగుతున్నాయి.అయితే ఈ అంశంపై ఇవాళ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసులతో భారత్‌కు ఎటువంటి రిస్క్ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవియన్ ఇన్‌ప్లుయాంజా కేసులతో పాటు, శ్వాసకోస వ్యాధుల సంఖ్య చైనాలో పెరుగుతున్నాయి. చిన్నారుల్లోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సర్కారు ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
చిన్నారుల్లో నుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఉత్తర చైనాలో ఆ కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. పిల్లల్లో నమోదు అవుతున్న నుమోనియా కేసులకు కొత్త తరహా ప్యాథోజన్‌తో లింకు లేదని చైనా వెల్లడించినట్లు డబ్ల్యూహెచ్‌వో ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నది. అక్టోబర్ నుంచి చైనా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు నమోదు అవుతున్నట్లు డేటా ప్రకారం తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాధులకు సంబంధించిన మరింత డేటాను ఇవ్వాలని చైనాను కోరినట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది.