Husband Murder Plan: వివాహేతర సంబంధం చిచ్చు, భర్తను చంపేందుకు మటన్‌లో సైనేడ్ కలిపిన భార్య, తినకుండా తప్పించుకున్న భర్త, పోలీసుల అదుపులో నిందితులు

ఏకంగా చంపేయడం వరకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్తపై అనుమానం పెంచుకున్న భార్య అతన్ని చంపేందుకు (Husband Murder Sketch) పథకం రచించిది. అది విఫలం కావడంతో పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమడోలులో (Bheemadolu) జరిగింది.

Husband Murder Plan attempt-murder-on-husband-wife-son-arrested-bhimadole in-west-godavari-district (Photo-Youtube Grab)

Amaravati, Febuary 19: అక్రమ సంబంధాల చిచ్చు కాపురాల్లో కలహాలను రేకెత్తిస్తున్నాయి. ఏకంగా చంపేయడం వరకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్తపై అనుమానం పెంచుకున్న భార్య అతన్ని చంపేందుకు (Husband Murder Sketch) పథకం రచించిది. అది విఫలం కావడంతో పోలీసుల చేతికి చిక్కింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమడోలులో (Bheemadolu) జరిగింది.

వివరాల్లోకెళితే..పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) భీమడోలు మండలం పొలసానిపల్లిలోని గోవింద్‌ గురునాథ్‌ పాల వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య ఇంటి దగ్గరే చిన్న దుకాణం నడుపుతోంది. అయితే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానం ఆమెకు కలిగింది.

ఈ విషయం మీద ఇద్దరూ ఎన్నో సార్లు గొడవపడ్డారు. అయితే అనుమానం అనేది ఇంకా పెరిగిపోవడంతో భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. కొడుకు కూడా తండ్రి అక్రమ సంబంధంపై గొడవపడుతుండే వాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేశారు.

పొదల్లోకి లాక్కెళ్లి మరీ మహిళపై అత్యాచారం

సైనేడ్ తినిపిస్తే ఎవరికీ అనుమానం రాదని కొందరు చెప్పడంతో పథకాన్ని అమల్లో పెట్టింది. ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్‌ సహకారంతో సైనేడ్‌ తెచ్చారు. దాన్ని ముందు కోడిపుంజుపై ప్రయోగించగా సఫలమైంది. అయితే తన కోడిపుంజు రంగు మారిపోవడంతో గురునాథ్ అనుమానం వ్యక్తం చేయగా.. తెగులు సోకి చనిపోయిందని రాణి నమ్మించింది. ఆదివారం భర్త కోసం మటన్ కూర (Mutton curry) వండిన రాణి అతడికి పెట్టింది. అయితే బయట వ్యక్తులు సైనేడ్ గురించి మాట్లాడుకోవడం విన్న గురునాథ్‌కు భార్యపై అనుమానం వచ్చింది.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేందుకు కుట్రపన్నిన ఐదుగురిని కఠినంగా శిక్షించాలని గురునాధ్ కోరుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.... గోవింద్‌ గురునాథ్‌ ఇంటిలోని మటన్ కర్రీ, సైనైడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. కాగా తనకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని చెప్పినా భార్య వినలేదని భర్త చెబుతున్నారు.



సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif