Chandigarh, Febuary 19: దేశంలో కామాంధుల ఆగడాలకు అంతే చిక్కడం లేదు. ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే జరుగుతున్నాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Disha Encounter Case) తరువాత మార్పనేది కానరావడం లేదు. టోల్‌ప్లాజా (Toll Plaza) వద్ద మూత్రవిసర్జన కోసం వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్ నంబర్లను (Mobile Numbers) ఇచ్చి మరీ వెళ్లిపోయారు. హర్యానాలోని (Haryana) కర్నాల్ జిల్లాలో ఫిబ్రవరి 16, ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బంధువులను కలుసుకునేందుకు రాత్రి 11 గంటల సమయంలో కర్నల్ టోల్‌ప్లాజా వద్ద ఆగారు. ఈ క్రమంలో సదరు మహిళ(19) మూత్రవిసర్జన కోసం పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది.
ఇది గమనించిన స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మహిళను కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. అంతేగాక ఘటన ప్రాంతంలో వారి మొబైల్ నెంబర్లను వదిలి వెళ్లారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్నిచెప్పుకుని విలపించింది.
నాపై జైలులో పలుమార్లు అత్యాచారం
దీంతో సోమవారం ఉదయం ఈ ఘటనపై మధుబాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన మధుబాన్ పోలీసులు (Madhuban police) ఘటనా స్థలంలో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడు టోల్ ప్లాజా సెక్యూరిటీ గార్డు సోనూ కాగా, మరొకడు టోల్ ప్లాజా దగ్గర చిప్స్ అమ్ముకునే మేఘరాజ్ గా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.