Coronavirus in India: భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు, 1 శాతానికి చేరిన రోజువారీ పాజిటివిటీ రేటు, 0.26 శాతానికి చేరిన యాక్టీవ్ కేసులు, గణనీయంగా తగ్గిన మరణాలు

రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,273 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 243 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,724 కి చేరింది.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi Feb 27: భారత్‌ లో కరోనా క్రమంగా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గతున్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 10,273 కరోనా కేసులు (Daily Corona cases) నమోదయ్యాయి. శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి 243 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,724 కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. నిన్న ఒక్కరోజే 20,439 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య (Corona (Active cases) కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,11,472 యాక్టీవ్ కేసులున్నాయి. అటు రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు (Daily positivity rate) భారీగా తగ్గింది. ప్రస్తుతం 1.00 %శాతంగా ఉంది.

కేరళతో పాటూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత తగ్గుతోంది.అటు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 1,77,44,08,129 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్లు కేంద్రం ప్రకటించింది. యువజనుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.