Coronavirus in India: భారత్‌లో సాధారణ స్థితికి చేరుతున్న పరిస్థితులు, 0.52 శాతానికి పడిపోయిన యాక్టీవ్ కేసులు, ఆందోళనకరంగా కరోనా మరణాలు, కేరళలో తగ్గని కరోనా తీవ్రత

భారత్‌లో కరోనా తీవ్రత (Corona Cases) క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొత్త కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 19వేల 968 మందికి కరోనా నిర్ధారణ అయింది. అయితే మరణాల (Corona deaths) సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 673 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దేశంలో యాక్టీవ్ కేసుల(Corona Active Cases) సంఖ్య గణనీయంగా తగ్గాయి.

COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

New Delhi, Feb 20: భారత్‌లో కరోనా తీవ్రత (Corona Cases) క్రమంగా తగ్గుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కొత్త కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 19వేల 968 మందికి కరోనా నిర్ధారణ అయింది. అయితే మరణాల (Corona deaths) సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 673 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దేశంలో యాక్టీవ్ కేసుల(Corona Active Cases) సంఖ్య గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 2,24,187 యాక్టీవ్ కేసులున్నాయి. దీంతో యాక్టీవ్ కేసుల సంఖ్య 0.52 శాతానికి పడిపోయింది. అటు రోజువారీ పాటివిటీరేటు (Daily positivity rate) 1.68 శాతంగా ఉంది. నిన్న రికవరీ అయినవారితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 4,20,86,383 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 5,11,903కు చేరుకుంది. మొత్తం కేసుల్లో ఎక్కువగా కేరళ (Kerala) నుంచి వస్తున్నాయి. అక్కడ కూడా గతంతో పోలిస్తే రోజువారీ కేసులు తగ్గుతున్నాయి. దీంతో దేశంలో కరోనా పరిస్థితులు సాధారణస్థితికి చేరుకునే అవకాశముంది.

అటు కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination)ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,75,37,22,697 కరోనా వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Corona in AP: ఏపీలో కేసులు భారీగా తగ్గుముఖం, గత 24 గంటల్లో 425 మందికి కరోనా, అన్ని జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు

బూస్టర్ డోసుల పంపిణీ కొనసాగుతోంది. 15-17 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ లో రికార్డులు బద్దలు కొడుతోంది ఆరోగ్యశాఖ. జనవరి నెలలో మొదలైన ఈ వ్యాక్సినేషన్ లో రెండు డోసులు పూర్తి చేసుకున్నవారి సంఖ్య దాదాపు రెండు కోట్లకు చేరువవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement