Operation Ganga: ఉక్రెయిన్ నుంచి పిల్లులను, కుక్కలను తమ వెంట తెచ్చుకున్న విద్యార్థులు, తాజాగా 628 మంది భారతీయులు స్వదేశానికి..

ఇన్నాళ్లు తమ వెంటే ఉన్న ఈ పెంపుడు జంతువులను అక్కడి ఉద్రిక్తత పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టం లేక వాటిని కూడా భారత్​కు తెచ్చామని తెలిపారు. వాయుసేన చేపడుతున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 628 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.

Operation Ganga

New Delhi, Mar 3: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను 'ఆపరేషన్​ గంగ' (Operation Ganga)పేరుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులను అక్కడ వదిలేశారు. కానీ పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకువచ్చేందుకు ఇటీవల కేంద్ర అనుమతించడం వల్ల ఇన్నాళ్లూ తమ వెంటే ఉంటున్న ఆ మూగజీవాల్ని (Indian Student Brings Friend’s Dog) స్వదేశానికి తీసుకువచ్చారు.

కేరళకు జహీద్​ మరో విద్యార్థి తన స్నేహితుడు ఉక్రెయిన్​లో వదిలేసిన పెంపుడు శునకాన్ని వెంట తెచ్చుకున్నాడు. నా పెంపుడు పిల్లి గత నాలుగు నెలలుగా నా వెంటే ఉంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో నాతో పాటే బంకర్లలో తలదాచుకుని, పోలాండ్​ సరిహద్దులు దాటి ఇప్పుడు భారత్​ చేరుకుందని గౌతం అనే విద్యార్థి తెలిపాడు. వాయుసేన ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో పోలాండ్​ నుంచి గురువారం పలువురు విద్యార్థులు భారత్​ చేరుకున్నారు. వారితో పాటు పెంపుడు పిల్లులు, శునకాలు దర్శనమిచ్చాయి.

Here's ANI Updates

ఇన్నాళ్లు తమ వెంటే ఉన్న ఈ పెంపుడు జంతువులను అక్కడి ఉద్రిక్తత పరిస్థితుల్లో వదిలేయడం ఇష్టం లేక వాటిని కూడా భారత్​కు తెచ్చామని తెలిపారు. వాయుసేన చేపడుతున్న విద్యార్థుల తరలింపు ప్రక్రియలో భాగంగా మరో 628 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. బుకెరాస్ట్​ నుంచి వచ్చిన విమానంలో 200 మంది, బుడాపెస్ట్​ నుంచి వచ్చిన దాంట్లో 220 మంది, రెజోవ్​ నుంచి వచ్చిన విమానంలో 208 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.

భారత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారు, ఉక్రెయిన్‌లో ఎవరూ బంధించలేదు, క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ, సరిహద్దు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడి

తరలింపు ప్రక్రియపై పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులు హర్​దీప్​ సింగ్​ పూరీ, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్​ రిజిజు, వీకే సింగ్​ ఇప్పటికే ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలైన హంగరీ, రోమేనియా, స్లోవేకియా, పోలాండ్​ చేరుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement