IPL Auction 2025 Live

Jharkhand Shocker: ఇంకా పోని కుల వివక్ష, 50 దళిత కుటుంబాలను ఊరి నుంచి తరిమేసిన గ్రామస్థులు, జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన

ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి (forced out of Murumatu village) తరిమేశారు. వారి కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు.

50 Dalit families assaulted, forced out of Murumatu village (Photo-JSR Police/Twitter)

Ranchi, August 31: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి (forced out of Murumatu village) తరిమేశారు. వారి కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన ( 50 Dalit families assaulted) జరిగింది.ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.

అంబులెన్స్ తలుపులు తెరుచుకోకపోవడంతో పేషెంట్ మృతి, కేరళలో విషాద ఘటన, దీనిపై దర్యాప్తు చేయాలని మంత్రి వీణా జార్జ్ ఆదేశాలు

పలామూ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషార్‌ కులానికి చెందిన 50 కుటుంబాలు మరుమటు గ్రామంలో నివసిస్తున్నాయి. సోమవారం హఠాత్తుగా కొందరు వీరు ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ చితకబాది ఇంటిసామగ్రిని బయటపడేసి ఇళ్లను ధ్వంసంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మేదినీనగర్‌ సబ్‌ డివిజినల్‌ ఆఫీసర్‌ రాజేశ్‌ కుమార్‌ షా, సబ్‌ డివిజన్‌ పోలీస్‌ ఆఫీసర్‌(ఎస్‌డీపీవో) సుర్జీత్‌ కుమార్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కల్పిస్తామని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన 150 మందిపై కేసు నమోదు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.