Job Crisis At IITs: దేశంలో టాప్ ఐఐటీలలో చదివినా విద్యార్థులకు నో జాబ్స్, సమాచార హక్కు చట్టం కింద సేకరించిన గణాంకాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు ప్లేస్ మెంట్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీలలో కలిపి 8,100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు.

IIT-Delhi.

భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకు అత్యుత్తమ  విద్యాసంస్థలుగా  పరిగణించబడుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)  ఉద్యోగ నియామక సంక్షోభంతో పోరాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలు ప్లేస్ మెంట్ల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీలలో కలిపి 8,100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు.

IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ దాఖలు చేసిన సమాచార హక్కు (RTI) దరఖాస్తుల ద్వారా వెల్లడైన డేటా ప్రకారం, 23 క్యాంపస్‌లలో సుమారు 8,000 (38%) మంది IITయన్లు ఈ సంవత్సరం ఖాళీగా ఉన్నారు. 2024లో ప్లేస్ మెంట్ల కోసం 21,500 మంది ఐఐటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 13,410 మందికి ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 38 శాతం (8,100) మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. రెండు సంవత్సరాల క్రితం 3,400 (19%) మంది విద్యార్థులు అన్‌ప్లేస్ అయినప్పటి నుండి ఇది గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగం పెద్ద సవాల్, 2030 నాటికి 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందంటున్న సరికొత్త నివేదిక

ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న 9 ఐఐటీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పాత 9 ఐఐటీలలో కలిపి 16,400 మంది ప్లేస్ మెంట్ల కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంకా 6,050 మంది (37 శాతం) ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీలలో క్యాంపస్ ప్లేస్ మెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న 5,100 మంది విద్యార్థుల్లో 2,040 మందిని (40 శాతం) కంపెనీలేవీ తీసుకోలేదు.

Here's News

కన్సల్టెంట్ మరియు IIT కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ లింక్డ్‌ఇన్‌లో సంబంధిత డేటాను పంచుకున్నారు. "IIT ఖరగ్‌పూర్‌లోని 33% మంది విద్యార్థులకు గత సంవత్సరం ప్లేస్‌మెంట్‌ల ద్వారా ఉద్యోగాలు లభించలేదు. ఉద్యోగ నియామకాల పేలవమైన పరిస్థితుల కారణంగా ప్లేస్‌మెంట్ లేని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన మరియు నిస్సహాయతతో వ్యవహరిస్తున్నారు" అని ఆయన రాశారు.

ఐఐటీ ఢిల్లీలో గత రెండేళ్లలో 600 మందికి జాబ్స్ రాలేదు. గత ఐదేళ్లలో ఐఐటీ ఢిల్లీలో 22 శాతం మందికి ఉద్యోగాలు రాలేదు. వారిలో 40 శాతం మంది స్టూడెంట్స్ కు 2024లోనూ ఉద్యోగాలు లభించలేదు. ఉద్యోగాలు రాని విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు’ అని ధీరజ్ పేర్కొన్నాడు. అలాగే 61 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదని చెప్పాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించాడు. అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు లభించకపోవడం దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోందని పేర్కొన్నాడు.

ఈ ప్లేస్‌మెంట్ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది మొత్తం ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో చాలా మంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు.విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్ కళాశాలల్లో అనిశ్చిత స్థితిని సూచిస్తుంది. దాదాపు 61% పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు ఇప్పటికీ ఉద్యోగాలకు నోచుకోలేదు. ఇది మన ప్రధాన కళాశాలలు,  మన యువ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న అపూర్వమైన ఉద్యోగ సంక్షోభం అని సింగ్ హైలైట్ చేశారు.