Kanpur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి, హైవేపై వేగంగా వెళ్తూ జేసీబీని ఢీకొట్టిన శతాబ్ది ఏసీ బస్సు, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విషాద ఘటన, సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Kanpur Road Accident) జరిగింది. యూపీలోని కాన్పూర్‌ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో (UP Bus Accident) 16 మంది చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Kanpur Road Accident Visuals. (Photo Credits: ANI)

Kanpur, June 9: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Kanpur Road Accident) జరిగింది. యూపీలోని కాన్పూర్‌ జిల్లా సచేంది ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో (UP Bus Accident) 16 మంది చనిపోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. హైవేపై వేగంగా వెళ్తున్నశతాబ్ది ఏసీ బస్సు రోడ్డుపై ఉన్న జేసీబీని ఢీకొంది. ఆ తీవ్రతకు ఆ జేసీబీ రోడ్డు పక్కన పడిపోగా, బస్సు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్క గుంతలో పడిపోయింది. బస్సులోనే ప్రయాణికులంతా ఇరుక్కుపోయి, తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులతో ఉన్న బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం జరగ్గా.. ఈ సమయంలో బస్సు చాలా వేగంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి, ఆస్పత్రికు తరలించినట్లు కాన్పూర్‌ రేంజ్‌ ఐజీ మోహిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఘోర రైలు ప్రమాదం, 30 మంది అక్కడికక్కడే మృతి, 50 మందికి పైగా గాయాలు, పాకిస్థాన్‌లో ఢీ కొన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సింధ్ ప్రాంతంలో రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన

ఈ ఘటనలో 16 మంది చనిపోగా ఐదుగురు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని.. సాధ్యమైనంత వరకు సహాయం అందించాలని సీనియర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు.ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం అందజేస్తామన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement