Karnataka Horror: పిల్లలు కాదు కామాంధులు, మైనర్ బాలికను మేడ మీదకు లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, నిందితులంతా 12 నుంచి 14 ఏళ్ళ వారే..

కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.దారుణమైన దాడి తర్వాత చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.

Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

కలబుర్గి, జూలై 8: కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.దారుణమైన దాడి తర్వాత చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు.

దీనికి సంబంధించి 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలనేరస్థులను రిమాండ్‌హోమ్‌కు తరలించగా, ఐదో నిందితుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ ఘటన కలబుర్గి మహిళా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఐదుగురు మైనర్ బాలురతో కూడిన నిందితుల ముఠా తన ఇంటి ముందు కూర్చున్న బాధితురాలిని చాక్లెట్ కొనిస్తానంటూ ఒక నిర్జన ప్రదేశానికి రప్పించింది. నిందితుల ముఠా బాలికను సమీపంలోని ఇంటి మేడపైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.

 వీడియో ఇదిగో, ఫ్యాంట్, డ్రాయర్ విప్పి రేప్ చేసేందుకు మహిళ వెంటపడిన కామాంధుడు, పాకిస్తాన్‌లో షాకింగ్ ఘటన

బాధితురాలు అంతకుముందు రోజు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత బాదం పప్పులను తింటూ ఉండగా బాలురు ఆమెను తీసుకెళ్లారు. నేరం చేసిన తర్వాత నిందితులు.. బాధితురాలిని ఏమీ చెప్పవద్దని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే ఎలాగోలా తన ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది.

బాలికను ఆస్పత్రికి తరలించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 366A (లైంగిక నేరానికి పాల్పడినందుకు మైనర్ బాలికను సేకరించడం), 376 (జి) (గ్యాంగ్ రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) నమోదు చేశారు. పోలీసులు వారిపై పోక్సో కేసు కూడా పెట్టారు.



సంబంధిత వార్తలు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

SI Suicide Case: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో ప్రియురాలు అరెస్ట్, రాంగ్‌ నెంబర్‌ కాల్ చేసి ఎస్‌ఐకి పరిచయం..ప్రేమ పేరుతో వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా పోలీసుల వెల్లడి