Karnataka Shocker: కర్ణాటకలో కలకలం రేపుతున్న మరో సాధువు అనుమానాస్పద మృతి , మఠంలోని ఓ గదిలో శవమై కనిపించిన సంత్ బసవలింగ స్వామి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
కర్ణాటకలో ఈ మధ్య కాలంలో ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు అనుమానాస్పదంగా మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది.
Bengaluru, Oct 25: కర్ణాటకలో ఈ మధ్య కాలంలో ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు అనుమానాస్పదంగా మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి.. మఠంలోని ఓ గదిలో శవమై (Lingayat seer found dead) కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆ గదిలో రెండు పేజీల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా (suspected case of suicide) పేర్కొంటూ కుదూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సోమవారం ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు మఠం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా సాధువు మరణం బయటపడింది. సమాచారం అందుకున్న కుదూర్ పోలీసులు స్వామిజీ మృతదేహాన్ని ఆస్పత్రికు తరలించి సాధువు గదిలో రెండు పేజీల నోట్‌ను స్వాధీనపర్చుకన్నారు. పరువు తీస్తామంటూ కొంత మంది వ్యక్తులు బెదిరిస్తున్నట్లు ఆ నోట్లో స్వామీజీ రాసినట్లుగా సమాచారం.
అతి పురాతనమైన ఈ మఠంలో గత 25 సంవత్సరాలుగా బసవలింగ స్వామి దర్శనమిస్తున్నారు. రామనగర పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి సాధువు మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.ఇక కర్ణాటక బెల్గాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలో రెండు నెలల క్రితం బసవ సిద్దలింగ స్వామి మృతదేహం లభ్యమైంది. శిష్యులు మఠం గదిని తెరిచి చూడగా సిద్దలింగం మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు కనిపించడంపై ఆ స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)