Minister Ramesh Jarakiholi: మంత్రి రమేశ్‌ జార్కిహొళి సెక్స్ వీడియో బయటకు, కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్న సీడీ, రాజీనామా చేయించే యోచనలో సీఎం యడ్డ్యూరప్ప సర్కారు

కర్ణాటకలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి శృంగార సీడీలు బయటకు రావడం కలకలం రేపుతోంది. కర్ణాటక జలవనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్కిహొళికి సంబంధించిన సెక్స్ వీడియో (Karnataka Minister Ramesh Jarakiholi) ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్‌ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త (Sex Tape Release By Dinesh Kallahalli) బెంగళూరు మీడియాకు విడుదల చేశారు.

Ramesh Jarkiholi. (Photo Credits: Twitter)

Bengaluru, Mar 3: కర్ణాటకలో ఉప ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి శృంగార సీడీలు బయటకు రావడం కలకలం రేపుతోంది. కర్ణాటక జలవనరులశాఖ మంత్రి రమేశ్‌ జార్కిహొళికి సంబంధించిన సెక్స్ వీడియో (Karnataka Minister Ramesh Jarakiholi) ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి రమేశ్‌ జార్కిహొళి ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను దినేశ్‌ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త (Sex Tape Release By Dinesh Kallahalli) బెంగళూరు మీడియాకు విడుదల చేశారు.

కేపీటీసీఎల్‌లో (కర్ణాటక పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్‌టీ నగర్‌కు చెందిన ఓ యువతిని లొంగదీసుకున్న మంత్రి రమేశ్‌జార్కిహొళి ఆమెతో రాసలీలలు (Karnataka minister caught on tapes) జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియోను ఎక్కడ, ఎవరు తీశారనే దానిపై స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి ఆ తర్వాత మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలేప క్కా ప్రణాళికతోనే వీడియో తీయించి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. షార్ట్‌ ఫిల్మ్‌ తీసేందుకు మంత్రితో ఆమె సాన్నిహిత్యం పెంచుకున్నట్టు మరో కథనం ద్వారా తెలుస్తోంది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని దినేశ్‌ కల్లహళ్లి బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో రెండు రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే, రమేశ్‌ జార్కిహోళి అడ్డా బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్నాయి.

కర్ణాటక అసెంబ్లీలో పోర్న్ వీడియోల కలకలం, శాసనమండలిలో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌, వార్తలను ఖండించిన నేత, గతంలో పోర్న్ చూస్తూ దొరికిన ముగ్గురు బీజేపీ నేతలు

తాజాగా లీక్‌ అయిన శృంగార సీడీ వ్యవహారం ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. సభలో ఈ వ్యవహారంపై సర్కారును ఇరుకునపెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కాగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్‌ జార్కిహొళి అత్యంత కీలకంగా వ్యవహరించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఈయన. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక శాఖ నేతలతో విభేదించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి తీసుకు రావడానికి పక్కాగా పావులు కదిపారు. అలాంటి నేత వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది.

ప్రధానోపాధ్యాయుడి ఘాతుకం, మైనర్ విద్యార్థినులకు బలవంతంగా పోర్న్ వీడియోలు చూపుతూ బలత్కారం, కేసు నమోదు చేసిన పోలీసులు

మరోవైపు శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రం గా మారకముందే ఆయనతో రాజీనామా చేయించే అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే తన పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని బెంగళూరులో మంత్రి జార్కిహొళి స్పష్టం చేశారు. ‘వీడియోను విడుదల చేసిన సామాజిక కార్యకర్త ఎవరో తెలియదు. వీడియోలో కనిపించిన యువతి ఎవరో కూడా తెలియదు. తప్పు చేసిన ట్టు రుజువైతే ఉరిశిక్షకూ సిద్ధమే’ అని మంత్రి ప్రకటించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now