Karnataka Shocker: టీచర్ పాడుబుద్ధి, విద్యార్థిని మొబైల్‌కు ఆ వీడియోలు, హనీమూన్‌లో అలా చేసుకుందామంటూ ఛాటింగ్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
కోలార్ తాలూకాలోని నరసాపురంలో ఒక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యకరంగా సంభాషించినందుకు బుధవారం సస్పెండ్ (Kolar high school teacher suspended ) చేశారు.ఈ ఘటన కోలారు తాలూకాలోని నరసాపురం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది
Kolar, Dec 9: కోలార్ తాలూకాలోని నరసాపురంలో ఒక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యకరంగా సంభాషించినందుకు బుధవారం సస్పెండ్ (Kolar high school teacher suspended ) చేశారు.ఈ ఘటన కోలారు తాలూకాలోని నరసాపురం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.విద్యార్థిని మొబైల్‌కు అశ్లీల మెసేజ్‌లు (indecent behavior with girl student) పంపాడని ఆమె తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల వద్దకు వచ్చి కన్నడ ఉపాధ్యాయుడు సిఎం ప్రకాష్‌ను నిలదీశారు. బీఈఓ ఎదుట ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు.
కాగా అసభ్యకరమైన సందేశం పంపినందుకు నరసపురలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ కన్నడ అసిస్టెంట్ టీచర్ సిఎం ప్రకాష్‌ను సస్పెండ్ చేస్తూ డిడిపిఐ కృష్ణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.వాట్సాప్‌లో హనీమూన్ గురించి తమ కూతురితో చర్చలు చేశాడని వారు ఆరోపించారు. ఈ ఉపాధ్యాయుడు 2010లో కూడా ఇదే పాఠశాలలో ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి సస్పెండు అయ్యాడు. అప్పుడు అక్కడి బదిలీ అయ్యి తిరిగి ఇదే పాఠశాలకు తిరిగి వచ్చాడు. తాజా సంఘటన నేపథ్యంల ఈ టీచర్‌ను బీఈఓ కన్నయ్య సస్పెండు చేశారు.
ఉపాధ్యాయుడు బాలికకు సందేశం పంపినట్లు తమకు ఫిర్యాదులు అందాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి, “మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏమి చేస్తున్నారు? ఆనందించండి” హనీమూన్ అంటే ఏమిటో తెలుసా అని నిందితుడు వాట్సాప్ లో అడిగాడని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాకుండా తాకరాని చోట తాకాడని కూడా వారు తెలిపారు. విచారణలో అటువంటి చర్యలకు పాల్పడినట్లు ఉపాధ్యాయుడు లిఖితపూర్వకంగా అంగీకరించినట్లు తెలిసింది.