Tamil Nadu Shocker: కామాంధులా లేక రాక్షసులా..40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం, ప్రైవేట్ భాగాలపై బీరు బాటిళ్లతో దాడి, అడ్డువచ్చిన భర్తను గాయపరిచిన నిందితులు, తమిళనాడు పళనిలో దారుణ ఘటన
భర్త లేని సమయం చూసి ఒంటరి మహిళపై కామాంధులు అ దారుణానికి ఒడిగట్టారు. IANS కథనం ప్రకారం..జూన్ 30 న తమిళనాడులోని పళనిలోని ప్రసిద్ధ కొండ మందిరానికి మహిళ మరియు ఆమె భర్త తీర్థయాత్ర చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
Thiruvananthapuram, July 12: తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల మహిళపై లాడ్జి మేనేజర్ సహా మరికొంత మంది అత్యాచారానికి (kerala woman brutally raped at Palani) పాల్పడ్డారు. భర్త లేని సమయం చూసి ఒంటరి మహిళపై కామాంధులు అ దారుణానికి ఒడిగట్టారు. IANS కథనం ప్రకారం..జూన్ 30 న తమిళనాడులోని పళనిలోని ప్రసిద్ధ కొండ మందిరానికి మహిళ మరియు ఆమె భర్త తీర్థయాత్ర చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
ఈ సంఘటన జరిగినప్పుడు దంపతులు దిండిగల్ జిల్లాలోని పళని ప్రాంతంలోని లాడ్జిలో బస చేసినట్లు సమాచారం. మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) చెప్పగా, తమిళనాడు పోలీసులు అలాంటి ఫిర్యాదును నిరాకరించినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తమిళనాడుకు చెందిన మహిళ, ఆమె భర్త ఉద్యోగాల కారణంగా కేరళలో కన్నూర్‌లో ఉంటున్నారు. వీరు కేరళ నుంచి తమిళనాడురాష్ట్రంలోని దిండిగల్ జిల్లా పళనిలో తీర్థ యాత్రలకు బయలుదేరారు. ఈ ఈ క్రమంలో వారు ఓ లాడ్జిలో బస చేశారు. తన భర్త ఆహారం కోసమని బయటకు వెళ్లగా.. అది గమనించిన కొందరు వ్యక్తులు లాడ్జ్ మేనేజర్‌తో సహా తనపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారని వాపోయింది. అనంతరం తన ప్రైవేట్ భాగాలలో బీర్ బాటిళ్లతో (beer bottles in her private parts) గాయపరిచినట్లు తెలిపింది.
ఈ ఘటన జరిగిన కాసేపటికి తన భర్త తిరిగి లాడ్జికి చేరుకోగానే నిందితులు ఆయనపై దాడి చేసినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. జూన్ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఆ ప్రాంత పోలీసులు బాధితురాలి ఫిర్యాదును నిరాకరించినట్లు ఇయాన్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం బాధితురాలు పరియారంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తలాస్సరి డీఎస్సీ తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు అధికారి అయిన తలాసేరీ డిప్యూటీ సూపరింటెండెంట్ (డిఎస్పి) మూసా వల్లికాదన్ మాట్లాడుతూ, "నేను కన్నూర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికల్ రిపోర్ట్ కోసం వెళ్ళాను. అయితే ఆ రిపోర్ట్ లో ఆమె చెప్పిన ప్రాతిపదికన ఎటువంటి గాయాలు లేవు. అయితే జూన్ 20 న ఈ ఆరోపించిన సంఘటన జరిగినందున, ఫిర్యాదుదారుల ప్రకారం, గాయాలు కూడా నయం కావచ్చని ఆయన తెలిపారు.