Kolkata Shocker: గెస్ట్ హౌస్‌లో పార్టీ అన్నారు..ఫ్రెండ్స్ కదా అని వెళితే మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు, కోలకతాలో టెకిపై సామూహిక అత్యాచారం

తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోలకతాలో (Kolkata Shocker) దారుణం చోటు చేసుకుంది. పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌లో మ‌హిళా టెకీపై సామూహిక అత్యాచారానికి (30-Year-Old BPO Executive Gang-Raped) పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మ‌హిళ స‌హా ముగ్గురు నిందితుల‌ను పోలీల‌సులు అరెస్ట్ చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Kolkata, June 17: దేశంలో లైంగిక వేధింపులు ఆగడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోలకతాలో (Kolkata Shocker) దారుణం చోటు చేసుకుంది. పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌లో మ‌హిళా టెకీపై సామూహిక అత్యాచారానికి (30-Year-Old BPO Executive Gang-Raped) పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో మ‌హిళ స‌హా ముగ్గురు నిందితుల‌ను పోలీల‌సులు అరెస్ట్ చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని విధాన్‌న‌గ‌ర్ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లో గ‌తవారం ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని బీపీఓ ఎగ్జిక్యూటివ్ (30)గా ప‌నిచేసే బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

త‌న సీనియ‌ర్ స‌హ‌చ‌రులు (Senior Colleagues) ఇద్ద‌రు పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌కు పిలిచి మ‌త్తుమందు క‌లిపిన డ్రింక్ ఇచ్చి త‌నపై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని బాధితురాలు ఆరోపించింది. ఘ‌ట‌న స‌మ‌యంలో మ‌హిళా కొలీగ్ కూడా ఉంద‌ని ఆమె పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

పాకిస్తాన్‌లో దారుణం, తుపాకీ గురిపెట్టి ఇద్దరు హిందూ యువతులపై గ్యాంగ్ రేప్, లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో దారుణం

జూన్ 15న బ‌గియాటి పోలీస్ స్టేష‌న్‌లో బాధితురాలు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టామ‌ని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల‌ను భాస్క‌ర్ బెన‌ర్జీ, చ‌ర‌ణ్‌జిబ్ సూత్ర‌ధార్‌, ఇంద్రాణి దాస్‌గా గుర్తించారు. పార్టీకి కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారని, వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారని, వీరంతా టెలిమార్కెటింగ్ సిబ్బందికి చెందిన వారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.