KTR: ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఇదేనా..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్నల వర్షం, అర్హతలు లేని బావమరిది కంపెనీకి వేల కోట్లు కట్టబెట్టడమేనా ఇన్నోవేటివ్!

ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ? అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం.. నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మానేజ్మెంటు చెయ్యడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.

KTR Sensational comments on Jr NTR Devara pre release cancel (BRS X)

Hyd, Sep 26:  సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా కడిగిపారేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి ? అని రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి తర్వాత మాట తప్పడం. దేవుళ్ళ మీద ఒట్టేసి వారికి కూడా శఠగోపం పెట్టడం.. నూరు రోజులు, ఆరు గారంటీలు అని ఊదరగొట్టి తర్వాత వాటిని మర్చిపోవడం, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రతిరోజూ ఒక కొత్త డ్రామా సృష్టించి, హెడ్ లైన్ మానేజ్మెంటు చెయ్యడం ఇన్నోవేటివ్ థింకింగా అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం ఇచ్చిన 30వేల ఉద్యోగాలు మనమే ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం, గతంలో ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టలేదు అని చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు పదిహేను వేల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మనమే కట్టినట్టు పోజులు కొట్టడం, అర్హతలు లేని బావమరిది కంపెనీ కి వేల కోట్ల ప్రజా సొమ్ము కట్టబెట్టడం , కుటుంబపాలన అని విమర్శించి, ఇదివరకు అడ్రస్ లేని తన అన్నదమ్ముళ్లు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని మభ్యపెట్టడం ఏంటో చెప్పాలన్నారు కేటీఆర్.   ద‌స‌రాకు ఇందిర‌మ్మ క‌మిటీలు, రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, విధివిధానాలు రూపొందించాలని సూచన

Here's Tweet:

తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ బాసులకు దారాదత్తం చెయ్యడం, ఇతర పార్టీ MLA లను చేర్చుకోవడం, తర్వాత చేరలేదని బుకాయించడం , ఫార్మా సిటీ రద్దు అని బయట చెప్పడం, హైకోర్ట్ లో మాత్రం రద్దు చెయ్యలేదు అని న్యాయమూర్తులను కూడా మోసం చెయ్యడం, ఇష్టారీతిన పేదల ఇండ్లు కూల్చడం, బ్రదర్ ఇల్లు మాత్రం ముట్టకపోవడం ,ఇంకా చాలా ఉన్నాయ్ చెప్పాలి అంటే అని ప్రశ్నించారు కేటీఆర్.