KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్, విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?, తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే!

ఎక్స్ వేదికగా రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్..కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? అని ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అన్నారు.

KTR slams CM Revanth revanth reddy govt failures(X)

Hyd, Nov 10:  సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ వేదికగా రేవంత్‌ని ప్రశ్నించిన కేటీఆర్..కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? అని ప్రశ్నించారు. ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే అన్నారు.

కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా”. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలు అన్నారు.

ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్” అని దుయ్యబట్టారు.

ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు.ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకుంటారా ?  కార్తీక మాసం..యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం...దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు 

Here's Tweet:

బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా ? పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా ? 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా ?,75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే అన్నారు. ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు అన్నారు.



సంబంధిత వార్తలు

Paidi Rakesh Reddy: మంత్రి కోమటిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్, మతిస్థిమితం లేకుండా తాగే పిచ్చి ఎంకడు, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్

CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif