Live-In Relationships: స‌హ‌జీవ‌నం కరెక్ట్ కాదు, ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట వేసిన పిటిషన్‌పై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు, యువతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్

స‌హ‌జీవ‌నం (లివ్‌ ఇన్‌ రిలేన్‌షిప్‌) పై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. ఈ బంధం (Live-In Relationships) సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టులో (Punjab and Haryana High Court) పిటిష‌న్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జ‌రిపిన న్యాయ‌స్థానం స‌హ‌జీనంపై పై వ్యాఖ్య‌లు చేసింది.

Image used for representational purpose only (Picture Credits: PTI)

Chandigarh, May 18: స‌హ‌జీవ‌నం (లివ్‌ ఇన్‌ రిలేన్‌షిప్‌) పై పంజాబ్‌, హర్యానా హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. ఈ బంధం (Live-In Relationships) సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టులో (Punjab and Haryana High Court) పిటిష‌న్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జ‌రిపిన న్యాయ‌స్థానం స‌హ‌జీనంపై పై వ్యాఖ్య‌లు చేసింది.

పిటిషినర్లు గుల్జా కుమారి(19), గురువిందర్‌ సింగ్‌(22) తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు. అయితే గుల్జాకుమారి త‌ల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారు ఇండ్ల నుంచి పారిపోయి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు తాము కలిసి నివసిస్తున్నామని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు. గుల్జా కుమారి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్సించాల్సిందిగా కోరుతూ.. కోర్టును ఆశ్రయించారు.

ఈ సందర్భంగా కోర్టు.. ‘‘వాస్తవానికి పిటిషినర్లు దాఖలు చేసిన పిటిషన్‌ ద్వారా తమ లివ్‌ ఇన్‌ రిలేషన్‌కు ఆమోద ముద్ర కోరుతున్నారు. కానీ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదు’’ అని జస్టిస్‌ హెచ్‌ఎస్‌ మదాన్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement