Madhya Pradesh: ఇద్దరు భార్యల దగ్గర చెరో మూడు రోజులు గడుపు, ఆదివారం మాత్రం నచ్చిన చోట ఉండు, ఫ్యామిలీ కేసులో గ్వాలియర్ కోర్టు సంచలన తీర్పు

ఫ్యామిలీ కేసు తీర్పులో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌ కోర్టు (Gwalior Family Court) సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు భార్యల భర్తకు తమ ఇద్దరు భార్యలతో సమానంగా రోజులు (both wives for 3 days each) పంచుకోవాలని ఆదివారం మాత్రం నచ్చిన చోటులో ఉండాలని తీర్పును వెలువరించింది.

Representational Image (Photo Credit: ANI/File)

Gwalior, Mar 15: ఫ్యామిలీ కేసు తీర్పులో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌ కోర్టు (Gwalior Family Court) సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు భార్యల భర్తకు తమ ఇద్దరు భార్యలతో సమానంగా రోజులు (both wives for 3 days each) పంచుకోవాలని ఆదివారం మాత్రం నచ్చిన చోటులో ఉండాలని తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌‌కు చెందిన వ్యక్తి హర్యానాలో ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో భార్యను అతడు పుట్టింటికి పంపాడు.

మరొకరితో సంబంధం, అడ్డుగా ఉన్నారని భర్తను, అత్తను ముక్కలుగా నరికిన మహిళ, ఆ ముక్కలను మూడు రోజులు ప్రిజ్‌లో ఉంచి తరువాత బయట పారేసిన కసాయి భార్య

అయితే ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ అతడు తన భార్యను ఇంటికి తీసుకురాకుండా హర్యానా వెళ్లిపోయాడు. అక్కడ తన సహోద్యోగి అయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక భర్త వస్తాడని, తనను తీసుకెళ్తాడని చూసి చూసి విసిగిపోయిన మొదటి భార్య చివరికి తనే హర్యానాలో భర్త ఇంటికి వెళ్లింది. అక్కడ తన భర్త మరో మహిళతో కాపురం చేస్తుండడంతో షాకయింది.

భార్యకు వైద్య చికిత్స అందించకపోవడం క్రూరత్వం కిందకు రాదు, భార్య ఆత్మహత్య కేసులో సంచలన తీర్పు వెలువరించిన ముంబై సెషన్స్ కోర్టు, భర్త నిర్దోషిగా విడుదల

ఆ తర్వాత న్యాయం కోసం గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరికి ముగ్గురితో కలిసి చర్చలు జరిపిన తర్వాత భార్యలు ఇద్దరు అతడితో కలిసి ఉండేందుకు అంగీకరించడంతో భర్తను కోర్టు సమానంగా విభజించింది. ఒక భార్య వద్ద మూడు రోజులు, మరో భార్య దగ్గర మూడు రోజులు గడిపాలని, ఆదివారం మాత్రం అతడి ఇష్టమని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన భర్త భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement