గౌహతి,Feb 20: అస్సాంలో దారుణం (Assam Shocker) చోటు చేసుకుంది. ఓ మహిళ గౌహతిలో తన భర్త, అత్తగారిని హత్య చేసి (woman killed Aunt), వారి మృతదేహాలను కత్తిరించి, మూడు రోజుల పాటు ఇంట్లో ఫ్రిజ్‌లో (kept body pieces in fridge for days) ఉంచి, పొరుగున ఉన్న మేఘాలయలో వాటిని పారవేసింది. ఈ ఘటనలో మహిళను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు.బందన కలిత అనే మహిళను ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తి ధంజిత్ దేకా, ఆమె స్నేహితుడు అరూప్ దాస్‌తో పాటు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గౌహతి పోలీస్ కమీషనర్ దిగంత బరాహ్ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నూన్‌మతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన బందన కలితకు ధంజిత్ దేకా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఏడు నెలల కిందట ప్రియుడు, మరో స్నేహితుడు అరూప్ దాస్‌తో కలిసి భర్త అమరేంద్ర దే (woman killed husband), అత్త శంకరి దేని హత్య చేసింది.
ఆ తర్వాత ఆ ముగ్గురూ కలిసి మృతదేహాలను పలు ముక్కలుగా నరికారు. మూడు రోజులపాటు ఫ్రిజ్‌లో ఉంచారు. అనంతరం మృతదేహాల ముక్కలను పాలిథిన్ కవర్లలో ఉంచి పొరుగున ఉన్న మేఘాలయలోని అటవీ ప్రాంతంలో పడేశారు. కాగా, కలిత ఆ మరునాడు తన భర్త, అత్త కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఎలాంటి సమాచారం వారికి లభించలేదు.
కొన్ని నెలల తర్వాత అమరేంద్ర సోదరుడు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోదరుడు, తల్లి అదృశ్యం వెనుక కలిత ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. కొన్ని ఆధారాలు లభించడంతో శుక్రవారం కలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్త, అత్త అదృశ్యంపై ఆమెను ప్రశ్నించారు. దీంతో వారిని హత్య చేసినట్లు ఆమె చెప్పింది.
ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆదివారం మేఘాలయా ప్రాంతంలో వెతకగా కొన్ని శరీర భాగాల ముక్కలు పోలీసులకు లభించాయి. ఈ నేపథ్యంలో కలిత, ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.