రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో పెండ్లికి నిరాకరించిందనo కోపంతో 19 ఏళ్ల యువతని ఓ 47 ఏళ్ళ వ్యక్తి దారుణంగా హింసించాడు. పదునైన ఆయుధంతో దాడిచేసి నడి రోడ్డుపై జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నిందితుడిని ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్‌గా గుర్తించారు. బాధితురాలు అతని వద్ద పనిచేస్తున్న యువతిగా గుర్తించారు.
ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని రాయ్‌పూర్ సీనియర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నింధితుడికి కఠినంగా శిక్షిస్తామన్నారు.
Here's Video
Girl, 16, Dragged By Hair For Declining 47-Year-Old's Marriage Proposal https://t.co/LxGLtXYigi pic.twitter.com/QrtfwsiNry
— NDTV (@ndtv) February 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)