ఛత్తీస్‌గఢ్‌ (Chattishgarh)లోని బిలాస్‌పూర్‌ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్‌ రైలు.. జయరామ్‌ నగర్‌ స్టేషన్‌ వద్ద ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్‌ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించాయి. ఘటనా ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వ‌ల్లే బస్సు ప్ర‌మాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు

Chhattisgarh Train Accident:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)