మావోయిస్టులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గడ్(Chhattisgarh) గరియాబంద్ జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతోంది భారీ ఎన్‌కౌంటర్(Encounter). తాజా ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్టేట్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ పాండన్న(Pandanna) మృతి చెందారు.

గత రాత్రి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతుల్లో ఒకరు అగ్రనేత పాండుగా గుర్తించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ డీకేఎస్ జేడీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు పాండన్న. భారీగా ఆయుధాలు,పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నాయి.

మూడు రోజులుగా   తుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లుతున్న సంగతి తెలిసిందే.  ఛత్తీస్‌ గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని (Encounter In Chhattisgarh) గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.   ఈ ఎన్‌ కౌంటర్‌ లో (Encounter) కనీసం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.  తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్‌ గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు మృతి 

Chhattisgarh encounter, Maoists top leader Pandu dead

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)