Encounter In Chhattisgarh (Credits: X)

Newdelhi, Jan 21: తుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్‌ గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని (Encounter In Chhattisgarh) గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌ కౌంటర్‌ లో (Encounter) కనీసం 14 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోల నుంచి పెద్దయెత్తున మందుగుండు సామగ్రిని భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

24 గంటల్లో 16 మంది..

సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు. దీంతో 24 గంటల వ్యవధిలో మొత్తం 16 మంది మావోలు మరణించినట్టు అయ్యింది. కాగా సోమవారం సాయంత్రం గరియాబంద్‌, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్‌ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. అదేవిధంగా నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు మృతిచెందగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్‌ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్‌ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. మృతుల్లో సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ మనోజ్‌, స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌ గుడ్డుతోపాటు మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు