Stabbed (file image)

Bengaluru, Feb 20: కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణ ఘటన (Karnataka Horror) చోటు చేసుకుంది. ఐఫోన్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఈ-కార్ట్ డెలివరీ బాయ్ ని 20 ఏళ్ల యువకుడు కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు మృతదేహాన్ని తన ఇంట్లో నాలుగు రోజుల పాటు భద్రపరిచి రైల్వే స్టేషన్‌కు సమీపంలో కాల్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని హాసన్‌లోని అరిస్కెరె పట్టణానికి చెందిన హేమంత్ దత్‌గా పోలీసులు గుర్తించారు. యాపిల్ ఐ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేశాడు ఈ 20 ఏళ్ల వ్యక్తి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ఐఫోన్ ను తీసుకువచ్చాడు. డబ్బులు చెల్లించి తీసుకోవాల్సిన యువకుడు.. తన దగ్గర చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో (Unable to pay for iPhone) హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

నడిరోడ్డు మీద యువకుడిని కత్తితో పొడిచిన 10 మంది యువకులు, విలవిల్లాడుతూ రోడ్డుపై కుప్పకూలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు

ఇందులో భాగంగా ఈ-కార్ట్ డెలివరీ బోయ్ ని హత్య (man kills delivery boy) చేశాడు. అతడి మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు తన ఇంట్లోనే రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపానికి తీసుకెళ్లి దహనం చేశాడు.అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11న కాలిన శరీరం వెలుగు చూడడంతో దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మరణించిన వ్యక్తిని హేమంత్ నాయక్ (23)గా గుర్తించారు.

ప్రియుడితో నగ్నంగా రూంలో అక్క ఉండగా చూసిన తమ్ముడు, తల్లిదండ్రులకు చెబుతానని బెదిరింపు, భయపడి కొడవలితో యువకుడి గొంతు కోసిన లవర్స్

ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ ఉద్యోగిగా దర్యాప్తులో వెల్లడైంది. లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ను బుక్ చేసుకోగా, దాన్ని డెలివరీ చేసేందుకు ఈ నెల 7న హేమంత్ నాయక్ వెళ్లాడు. రూ.46,000 చెల్లించాలని నాయక్ కోరడంతో... దత్తా కత్తితో దాడి చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ప్యాక్ చేసి బండిపై పెట్టుకుని, రైల్వే స్టేషన్ సమీపంలో దహనం చేసినట్టు గుర్తించారు. నిందితుడు మృతదేహాన్ని తగలబెట్టేందుకు వెళుతుండగా బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.