Madhya Pradesh Shocker: ఒకడు రేప్ చేస్తుంటే దాన్నిఇంకొకడు మరో ఫ్రెండ్‌కి లైవ్ పెట్టాడు, ఏడాది నుంచి బాలికపై అదే పనిగా అత్యాచారం, నిందితులను వెతికే పనిలో పోలీసులు

తాజాగా మధ్యప్రదేశ్‌లో అమానుషం(Madhya Pradesh Shocker) చోటుచేసుకుంది. గ్వాలియర్‌ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి (18-Year-Old Girl Gang-Raped in Gwalior) ఒడిగట్టారు.

Representational image (Photo Credit: File Photo)

Bhopal, June 13: దేశంలో మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడుల ఘ‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో అమానుషం(Madhya Pradesh Shocker) చోటుచేసుకుంది. గ్వాలియర్‌ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి (18-Year-Old Girl Gang-Raped in Gwalior) ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్‌లో స్ట్రీమ్‌ ( Crime ‘Live-Streamed’ to Friend) చేసి రాక్షస ఆనందం పొందారు. ఏడాదిగా బాలికపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించడంతో బాలిక భయపడిపోయింది.

ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితమే బాధితురాలికి మరో వ్యక్తితో నిశ్చితార్థమైంది. దీనిని అదునుగా భావించిన నిందితులు అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది. బాలిక తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అ‍న్యాయంపై ఝాన్సీ రోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మొదటగా 2021 జూన్‌ 2న ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై అఘాయిత్యం చేశారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

వీళ్లు మనుషులేనా, ఈవ్‌ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై బ్లేడుతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు, 118 కుట్లువేసి చికిత్స చేసిన వైద్యులు, ఘటనపై స్పందించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్

లైంగికదాడి సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను తర్వాత వాళ్లు సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేశారని తెలిపింది. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించినట్లు తెలిపింది. శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని కొత్వాలి పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ రాజీవ్ గుప్తా తెలిపారు. నిందితుల‌పై పోక్సో, ఐటీ చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.