Madhya Pradesh Shocker: దారుణం.. అడవిలో రెండు రోజుల పాటు మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం, ఆపై విషం తాగించి బాలికను వదిలిసిన కామాంధుడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘటన చోటు (Madhya Pradesh Shocker) చేసుకుంది. రాష్ట్రంలో సీధి జిల్లాలోని హ‌త్వా అట‌వీ ప్రాంతంలో 15 ఏండ్ల బాలిక‌ను కిడ్నాప్ (Minor girl kidnapped) చేసిన నిందితుడు ప‌లుమార్లు లైంగిక దాడికి (raped repeatedly ) పాల్ప‌డ్డాడు. ఆ తర్వాత ఆమెకు విషం తాగించాడు.

Rape | Representational Image (Photo Credits: Pixabay)

Sidhi, Feb 16: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘటన చోటు (Madhya Pradesh Shocker) చేసుకుంది. రాష్ట్రంలో సీధి జిల్లాలోని హ‌త్వా అట‌వీ ప్రాంతంలో 15 ఏండ్ల బాలిక‌ను కిడ్నాప్ (Minor girl kidnapped) చేసిన నిందితుడు ప‌లుమార్లు లైంగిక దాడికి (raped repeatedly ) పాల్ప‌డ్డాడు. ఆ తర్వాత ఆమెకు విషం తాగించాడు. బాధిత బాలిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ( dies at Sidhi district hospital) సోమ‌వారం మ‌ర‌ణించింది. కాగా నిందితుడు ఈనెల 11న బాలికను రెవా జిల్లాలోని ఆమె అత్త ఇంటి నుంచి అప‌హ‌రించారు.

త‌న‌పై లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుడు త‌న‌ను ఆస్పత్రిలో చేర్చేముందు బ‌ల‌వంతంగా విషం తాగించాడని బాలిక త‌న స్టేట్‌మెంట్‌లో వెల్ల‌డించింది. బాధిత బాలిక మేన‌త్త పిర్యాదు ఆధారంగా ఈనెల 11న రెవా పోలీసులు కిడ్నాప్ కేసు న‌మోదు చేశారు. రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌లేని జీపులో ఇద్ద‌రు వ్య‌క్తులు త‌మ ఇంటికి వ‌చ్చి త‌న మేన‌కోడ‌లిని కిడ్నాప్ చేశార‌ని మేన‌త్త ఫిర్యాదు చేసింది. పోలీసుల ద‌ర్యాప్తులో భాగంగా ఈనెల 13 అర్ధ‌రాత్రి జిల్లా ఆస్ప‌త్రి గేటు వ‌ద్ద అనిల్ తివారీ అనే వ్య‌క్తి బాలిక‌ను దింపివెళ్లిన‌ట్టు గుర్తించారు.

స్కూలులో కామాంధుడుగా మారిన టీచర్, 13 మంది విద్యార్థినులపై దారుణంగా అత్యాచారం, గర్భం దాల్చిన ఎనిమిది మంది, నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించిన ఇండోనేషియా కోర్టు

అయితే బాలిక త‌న స్టేట్‌మెంట్‌లో హ‌త్వా గ్రామానికి చెందిన జీవేంద్ర సింగ్‌, అభ్య‌రాజ్ యాద‌వ్ త‌న‌ను కిడ్నాప్ చేశార‌ని, జీవేంద్ర సింగ్ రెండు రోజుల పాటు త‌న‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని పేర్కొంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు వేగ‌వంతం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement