Maharashtra Horror: మనుషులేనా.. మైనర్ బాలికపై తెగబడిన 29 మంది కామాంధులు, రేప్ ఘటన వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ నెలల తరబడి అత్యాచారం, ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
గతంలో దారుణ ఘటనలు (Maharashtra Horror) మరువక ముందే.. థానేలో మరో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 29 మంది సామూహిక అత్యాచారానికి (Minor Girl Gangraped by 29 in Dombivli) ఒడిగట్టారు.
Dombivali, September 23: మహారాష్ట్ర అత్యాచారాలకు అడ్డాగా మారుతోంది. గతంలో దారుణ ఘటనలు (Maharashtra Horror) మరువక ముందే.. థానేలో మరో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా అత్యంత కౄరంగా 29 మంది సామూహిక అత్యాచారానికి (Minor Girl Gangraped by 29 in Dombivli) ఒడిగట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. బుధవారం రాత్రి బాధితురాలు డోంబివాలిలోని మాన్పాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బాలిక స్నేహితుడే. ముందుగా ఈ ఏడాది జనవరిలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడి, ఈ దృశ్యాలను వీడియో తీశాడు. ఈ వీడియోను అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తూ మిగతావారు ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడ్డారు. అలా జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 29 మంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 21 మందిని (21 Accused Arrested) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరారీలో ఉన్న మరో ఎనిమిది మంది నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అరెస్టు చేసిన వారందరిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దత్తాత్రేయ వెల్లడించారు. గత తొమ్మిది నెలలుగా బాధితురాలిపై అత్యాచారం పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.