Pune Shocker: అక్రమ సంబంధం, కొడుకు అడ్డుగా ఉన్నాడని వేటి నీటిలో ముంచి చంపిన కసాయి, పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి

మహారాష్ట్రలోని పుణెనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్‌లో బాలుడ్ని ముంచాడు.

Representational Image | (Photo Credits: IANS)

Pune, April 24: మహారాష్ట్రలోని పుణెనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడ్ని దారుణంగా హత్య చేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా వేడి వేడి నీళ్లున్న బకెట్‌లో బాలుడ్ని ముంచాడు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్రమ్ శరద్ కోలేకర్ ఖేడ్‌లో నివసిస్తున్నాడు. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళతో చాలా కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె కూడా ఖేడ్‌లోనే ఉంటోంది. అయితే ఏప్రిల్ 6న ఉదయం మహిళ ఇంటికెళ్లాడు విక్రమ్. పిల్లాడిని ఇతనికి అప్పగించి ఆమె బయటకు వెళ్లింది. ఈ సమయంలో చిన్నారిని వేడి నీటిలో ముంచాడు.

ప్రేమించలేదని బరితెగించిన ప్రేమోన్మాది, యువతి కళ్లలో కారం చల్లి,గొంతు కోసేందుకు ప్రయత్నం, స్థానికులు అడ్డుకోవడంతో పరార్

ఇంటికొచ్చి చూసిన తల్లి కాలిన గాయాలున్న కుమారుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. 15 రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. విక్రమ్ తనను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా అడుగుతున్నాడని, అందుకు తాను ఒప్పుకోలేదనే కోపంతోనే తన కుమారుడ్ని చంపాడని మహిళ ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై కేసు పెట్టింది. దీంతో విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement