Jharkhand Shocker: తాగుబోతు భర్తకు 11 మంది భార్యలు, వాళ్లు వదిలేయడంతో నలుగురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్న ఘనుడు, తాగొచ్చి చివరకు ఆమెను కూడా చంపేశాడు

జార్ఖండ్‌ రాష్ట్రం గిరిదిహ్‌ జిల్లాలోని తారాపూర్‌ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 మందిని పెళ్లి చేసుకున్న ఓ భర్త 12వ భార్యను తీవ్రంగా కొట్టి చంపేశాడు. విచిత్రమేమిటంటే తాగుబోతు వేధింపులతో 11 మంది భార్యలు అతన్ని విడిచి వెళ్లారు.

Stabbed (file image)

Ranchi, April 4: జార్ఖండ్‌ రాష్ట్రం గిరిదిహ్‌ జిల్లాలోని తారాపూర్‌ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 మందిని పెళ్లి చేసుకున్న ఓ భర్త 12వ భార్యను తీవ్రంగా కొట్టి చంపేశాడు. విచిత్రమేమిటంటే తాగుబోతు వేధింపులతో 11 మంది భార్యలు అతన్ని విడిచి వెళ్లారు.

11 పెళ్లిళ్లు చేసుకున్నా ఏ భార్యా ఎక్కువ రోజులు కాపురం చేయకపోవడంతో అతనికి సంతానం కలుగలేదు. ఆ తర్వాత నలుగురు పిల్లల తల్లిని 12వ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి వచ్చి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మూడు నెలల చిన్నారిని చంపి దంపతులు ఆత్మహత్య, కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

మరణించిన సావిత్రి దేవి గతంలోనే పెళ్లి చేసుకుని ముగ్గురు కొడుకులు, ఒక కూతురును కన్నది. ఆ తర్వాత భర్త మరణించడంతో పిల్లలతో కలిసి జీవనం గడుపుతోంది. అనంతరం తూరి పరిచయమై ఆమెను 12వ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా రామచంద్ర ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్యను దుర్భాషలాడుతూ కొట్టడం మొదలుపెట్టాడు.

సిద్దిపేటలో వీధి కుక్క హల్ చల్.. అదనపు కలెక్టర్‌ పై పడి రక్కిన శునకం.. తీవ్ర గాయాలు.. దవాఖానలో చేరిక

దెబ్బలకు తాళలేక ఆమె సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గురించిన సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు రామచంద్ర తూరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement