Mansa Shooting: వీడియో ఇదిగో.. ఫేస్‌బుక్ లైవ్‌లో ఉండగానే యాక్టివిస్ట్ పర్విందర్ సింగ్ జోతా దారుణ హత్య.. పంజాబ్‌లో తీవ్ర కలకలం..
పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త పర్విందర్ సింగ్ జోతా దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా పట్టణంలో ఓ మెడికల్ షాపు యజమాని జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Mansa Shooting: పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త పర్విందర్ సింగ్ జోతా దారుణ హత్యకు గురయ్యారు. మాన్సా పట్టణంలో ఓ మెడికల్ షాపు యజమాని జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ మొ భయానక ఘటన జోతా ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ స్ట్రీమింగ్) కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలను ఎదిరిస్తున్న పర్విందర్ సింగ్ జోతా.. స్థానిక మెడికల్ షాపుల్లో నిషిద్ధ సింథటిక్ డ్రగ్స్, మందుల అమ్మకాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు బయటపెడుతుంటారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం అశ్వనీ కుమార్ అనే వ్యక్తికి చెందిన మెడికల్ షాపు వద్దకు జోతా తన సహచరులతో కలిసి వెళ్లారు. అదే షాపులో నిషేధిత మందులు కొనుగోలు చేశాడని చెబుతున్న ఓ వృద్ధుడిని కూడా ఆయన తన వెంట తీసుకెళ్లారు. అసెంబ్లీలో ఒక్కసారిగా కుప్పకూలిన అధికారి.. వెంటనే CPR చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.. మార్గం మధ్యలో కన్నుమూత.. వీడియో ఇదిగో..
మెడికల్ షాపులో డ్రగ్స్ అమ్మకాల తీరును ప్రశ్నిస్తూ యజమానిని నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ దృశ్యాలన్నింటినీ జోతా తన మొబైల్ ద్వారా ఫేస్‌బుక్‌లో లైవ్ చేస్తుండగానే.. ఆగ్రహంతో ఊగిపోయిన షాపు యజమాని అశ్వనీ కుమార్ తుపాకీ బయటకు తీశాడు. ప్రాణాపాయం పొಂಚివున్నా ఏమాత్రం వెనకడుగు వేయని జోతా, తెగించి 'ధైర్యముంటే నన్ను చంపు' అంటూ అతనికి సవాలు విసిరారు.
Parvinder Singh Jhota Dies After Being Shot
దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు అశ్వనీ కుమార్ ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జోతా పొట్ట, తొడ భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లగా, ఒక బుల్లెట్ కాలేయాన్ని తీవ్రంగా చీల్చింది. ఈ ఘటనలో జోవాతో పాటు ఆయన సహచరులలో పలువురికి కూడా గాయాలయ్యాయి.
రక్తపు మడుగులో కుప్పకూలిన జోతాను వెంటనే స్థానికులు, సహచరులు మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం నిందితుడు అశ్వనీ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో నిత్యం ముందుండే సామాజిక కార్యకర్త ఇలా నడిరోడ్డుపై, సోషల్ మీడియా లైవ్‌లో అందరి కళ్ల ముందే హత్యకు గురికావడం పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని, డ్రగ్స్ మాఫియా దురాగతాలను మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మార్చింది. ఆసుపత్రి వద్ద భారీగా ప్రజలు, కార్యకర్తలు గుమికూడటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.