Monsoon 2023 in India: రైతన్నపై మళ్లీ పిడుగు, దేశంలో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు, ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని అంచనా వేసిన స్కైమెట్‌ వెదర్‌

దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్‌ వెదర్‌’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

Representational Image (File Photo)

New Delhi, April 11: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్‌ వెదర్‌’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. ఎల్‌నినోతో పాటు ఇతర అంశాలు రుతుపవనాలపై ప్రభావం చూపొచ్చని పేర్కొన్నది.

రుతుపవనాల రెండో అర్ధభాగం సీజన్‌లో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయని తెలిపింది.వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.

దేశంలో కొత్తగా 5676 కరోనా కేసులు, గత 24 గంటల్లో 14 మంది మృతి, 37 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఈ నేపథ్యంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించే పరిస్థితులూ ఉన్నాయని తెలిపింది. 20% కరవును స్కైమెట్‌ అంచనా వేస్తోంది. గత 4 సంవత్సరాలుగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఈ తాజా అంచనాలు.. వ్యవసాయరంగానికి దెబ్బగా మారే అవకాశం ఉంది. జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య నాలుగు నెలల కాలానికి వర్షపాతం దీర్ఘకాల సగటు 868.6 మిల్లీ మీటర్లు. ఇందులో 94 శాతం మాత్రమే ఈసారి పడే అవకాశం ఉందని ‘స్కైమెట్‌’ చెబుతోంది.

వర్షాకాలానికి కీలకమైన జులై ఆగస్టుల్లో ఉత్తర, మధ్య భారతాన్ని వరుణదేవుడు అంతగా కటాక్షించే అవకాశాల్లేవు. ఈ ప్రభావం గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో ఎక్కువ కనిపించనుంది. ఉత్తర భారత వ్యవసాయానికి కీలకమైన పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదు కానుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement