Mpox in India: భారత్‌లో మంకీపాక్స్‌ కేసు, వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఓ ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు.

Representational Image (File Photo)

New Delhi, Sep 9: ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఓ ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతనికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఎంపాక్స్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా వైరస్‌ కంటే ఎంపాక్స్‌ చాలా డేంజర్, ఇండియాలో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం, ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 600 మందికిపైగా మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. తాజాగా ఎంపాక్స్‌ వైరస్‌ ఆఫ్రికా బయట దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఎంపాక్స్‌ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడి చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్‌ లిస్ట్‌ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement